విజయవాడ ఏసీబీ కోర్టు(ACB Coourt) న్యాయమూర్తి సత్య వెంకట హిమబిందుపై(Hima bindu) జరుగుతున్న తప్పుడు ప్రచారపై రాష్ట్రపతి భవన్‌ స్పందించింది. సోషల్‌ మీడియాలో(Social media) జడ్జిని కించపరిచేలా పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్రపతి భవన్‌(Rashtrapathi Bhavan) కార్యదర్శి పీసీ మీనా(PC Meena)ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు

విజయవాడ ఏసీబీ కోర్టు(ACB Coourt) న్యాయమూర్తి సత్య వెంకట హిమబిందుపై(Hima bindu) జరుగుతున్న తప్పుడు ప్రచారపై రాష్ట్రపతి భవన్‌ స్పందించింది. సోషల్‌ మీడియాలో(Social media) జడ్జిని కించపరిచేలా పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్రపతి భవన్‌(Rashtrapathi Bhavan) కార్యదర్శి పీసీ మీనా(PC Meena)ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నిందితుడిగా ఉన్న స్కిల్ స్కామ్‌ కేసును(Skill scam case) ఏసీబీ కోర్టు జస్టిస్‌ హిమబిందు విచారిస్తున్నారు. ఈ కేసులో చంద్రబాబును రిమాండ్‌కు(Chandrababu Remand) పంపిస్తూ ఆమె ఆదేశాలు జారీ చేశారు. అప్పట్నుంచి హిమబిందును కించపరిచేలా సోషల్‌ మీడియాలో ప్రచారం చేయసాగారు ఓ వర్గం వారు. ఈ తప్పుడు ప్రచారాన్ని ఆపేందుకు చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టు(High Court) న్యాయవాది రామానుజం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం ఆంధ్రప్రదేశ్‌ ప్రధాన కార్యదర్శికి ఓ లేఖ రాసింది.న్యాయమూర్తి హిమబిందుపై తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్న వారిని గుర్తించి వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించింది. ఈ విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలను రామానుజానికి వివరించాలని పీసీ మీనా సూచించారు.

Updated On 23 Sep 2023 7:32 AM GMT
Ehatv

Ehatv

Next Story