Pawan kalyan Statemenst about CM Candidate : కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా నేను రెడీ..పవన్ స్టేట్మెంట్!
జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్(Pawan kalyan) నాలుగో విడత వారాహి యాత్ర(Varahi Yatra) చేపట్టారు. ఈ క్రమంలో అవనిగడ్డలో బహిరంగసభలో మాట్లాడారు. సభకు జనం బాగానే వచ్చారు. జనసేన, టీడీపీ(TDP) పొత్తు(Alliance) ప్రకటన తర్వాత జరుగుతున్న సభ కాబట్టి పవన్ ఏం మాట్లాడతారన్న ఆసక్తి అందరిలో కలిగింది. ఈ యాత్రలో పెద్ద ఎత్తున జనసేన, టీడీపీ కార్యకర్తలు హాజరయ్యారు. పవన్ కల్యాణ్ ఎప్పటిలాగే జగన్(Jagan) సర్కార్‌పై విమర్శలు చేశారు.
జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్(Pawan kalyan) నాలుగో విడత వారాహి యాత్ర(Varahi Yatra) చేపట్టారు. ఈ క్రమంలో అవనిగడ్డలో బహిరంగసభలో మాట్లాడారు. సభకు జనం బాగానే వచ్చారు. జనసేన, టీడీపీ(TDP) పొత్తు(Alliance) ప్రకటన తర్వాత జరుగుతున్న సభ కాబట్టి పవన్ ఏం మాట్లాడతారన్న ఆసక్తి అందరిలో కలిగింది. ఈ యాత్రలో పెద్ద ఎత్తున జనసేన, టీడీపీ కార్యకర్తలు హాజరయ్యారు. పవన్ కల్యాణ్ ఎప్పటిలాగే జగన్(Jagan) సర్కార్‌పై విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి జగన్‌ను తిట్టారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) మళ్లీ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో చెప్పుకొచ్చారు. తాను గతంలో టీడీపీతో ఎందుకు కలవాల్సివచ్చిందో, ఎందుకు ఆ పార్టీతో తెగతెంపులు చేసుకోవాల్సి వచ్చిందో వివరించాడు. అంశాల కోసమే టీడీపీతో విడిపోయాము తప్ప ప్రత్యేకించి కారణాలేమీ లేవని చెప్పాడు. టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి జనసేనాని ముఖ్యమంత్రి కావడం ఇక సాధ్యం కాదనే భావనకు ఆయన అభిమానులు వచ్చారు. కానీ అవనిగడ్డలో పవన్ మాట్లాడిన మాటలు విభిన్నంగా ఉన్నాయి. కూటమి తరపున ముఖ్యమంత్రి(CM) పదవిని చేపట్టాల్సి వస్తే నిరభ్యంతరంగా స్వీకరిస్తానని, రాష్ట్ర భవిష్యత్తు బాగుండటం కోసం సీఎం పదవి ఇస్తే కాదననని పవన్ చెప్పుకొచ్చారు. ఇంకా పవన్ ఏమన్నారో ఈ వీడియోలో చూద్దాం.