తెలుగుదేశంపార్టీ(TDP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అరెస్ట్‌(Chandrababu Arrest) చేసి రాజమండ్రి జైల్లో(Rajahmundry Jail) పెట్టిన వెంటనే జనసేన(Janasena) అధినేత పవన్‌కల్యాణ్‌(Pawan kalyan) గట్టిగా రియాక్టయ్యారు. రాజమండ్రి జైలుకు వెళ్లి చంద్రబాబును కలిశారు. టీడీపీకి మద్దతు ప్రకటించారు.

తెలుగుదేశంపార్టీ(TDP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అరెస్ట్‌(Chandrababu Arrest) చేసి రాజమండ్రి జైల్లో(Rajahmundry Jail) పెట్టిన వెంటనే జనసేన(Janasena) అధినేత పవన్‌కల్యాణ్‌(Pawan kalyan) గట్టిగా రియాక్టయ్యారు. రాజమండ్రి జైలుకు వెళ్లి చంద్రబాబును కలిశారు. టీడీపీకి మద్దతు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తాయని బహిరంగంగా ప్రకటించారు. ఈ సమయంలో చంద్రబాబుకు అండగా ఉంటానని చెప్పారు. ఇప్పటికే తాను పొత్తులో ఉన్న బీజేపీకి కూడా(BJP) ఇందులో కలిసిరావాలని అన్నారు. బీజేపీతో సంప్రదించకుండానే తాను ఈ పొత్తు విషయాన్ని ప్రకటిస్తున్నానని కూడా అన్నారు. బీజేపీ కూడా కలిసివస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అవసరమైతే తాను బీజేపీ పెద్దలతో మాట్లాడతానని పేర్కొన్నారు. ఇన్ని మాటలు మాట్లాడిన పవన్‌ కల్యాణ్‌ పార్టీ నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి తన నిర్ణయాన్ని వారందరికీ చెప్పారు. ఇది జరిగి పది రోజులపైనే అయ్యింది. అప్పుడు కనిపించిన పవన్‌ మళ్లీ ఇప్పటి వరకు కనిపించలేదు. ఆయన వ్యూహమేమిటో ఎవరికీ తెలియదు. పవన్‌ తీసుకున్న నిర్ణయం పట్ల పార్టీ నాయకులు, క్యాడర్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నది. ఎవరు అవునన్నా, కాదన్నా ఇది నిజం! పవన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నవారే వీరంతా!ఇదలా ఉంచితే ప్రస్తుతం పవన్‌ ఏం చేస్తున్నట్టు? ఢిల్లీ పెద్దలను ఎందుకు కలవడం లేదు? బీజేపీ పెద్దలే పవన్‌ను దూరం పెడుతున్నారా? అసలేం జరుగుతోంది...? ఈ వీడియోలో చూద్దాం.

Updated On 23 Sep 2023 7:45 AM GMT
Ehatv

Ehatv

Next Story