Pawan Kalyan : బీజేపీని పవన్ కల్యాణ్ వదిలేశారా?
చంద్రబాబు నాయుడు అరెస్ట్(Chandrababu Arrest) నేపథ్యంలో తెలుగుదేశంపార్టీ(TDP) రాష్ట్ర బంద్‌కు పిలుపిచ్చింది. ఈ బంద్‌కు జనసేన పార్టీ(Janasena Party) మద్దతు ప్రకటించింది. బంద్‌ను విజయవంతం చేయడానికి జనసేన కార్యకర్తలు పాటుపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ(AP BJP), జనసేనలు కలిసి ఉన్నాయి. ఎన్టీయేలో జనసేన భాగస్వామిగా ఉంది. ఆ రెండు పార్టీలు కలిసే ఏపీలో రాజకీయాలు చేస్తున్నాయి. వచ్చే ఎన్నికల తర్వాత ఎన్టీయేకు(NTA) చెందిన వారే ముఖ్యమంత్రి అవుతారని ఇటీవల పవన్(Pawan Kalyan) కామెంట్ కూడా చేశారు. టీడీపీని ఎన్డీయే కూటమిలోకి భారతీయ జనతా పార్టీ ఆహ్వానించలేదు
చంద్రబాబు నాయుడు అరెస్ట్(Chandrababu Arrest) నేపథ్యంలో తెలుగుదేశంపార్టీ(TDP) రాష్ట్ర బంద్‌కు పిలుపిచ్చింది. ఈ బంద్‌కు జనసేన పార్టీ(Janasena Party) మద్దతు ప్రకటించింది. బంద్‌ను విజయవంతం చేయడానికి జనసేన కార్యకర్తలు పాటుపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ(AP BJP), జనసేనలు కలిసి ఉన్నాయి. ఎన్టీయేలో జనసేన భాగస్వామిగా ఉంది. ఆ రెండు పార్టీలు కలిసే ఏపీలో రాజకీయాలు చేస్తున్నాయి. వచ్చే ఎన్నికల తర్వాత ఎన్టీయేకు(NTA) చెందిన వారే ముఖ్యమంత్రి అవుతారని ఇటీవల పవన్(Pawan Kalyan) కామెంట్ కూడా చేశారు. టీడీపీని ఎన్డీయే కూటమిలోకి భారతీయ జనతా పార్టీ ఆహ్వానించలేదు. పిలుపు కోసం టీడీపీ ఆశగా ఎదురుచూస్తూ ఉంది. కలవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది. కానీ బీజేపీ నుంచి మాత్రం సిగ్నల్స్ రావడం లేదు. టీడీపీని ఎన్టీయేలోకి బీజేపీ పిలవాలన్నది పవన్ కోరిక. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌కు సంబంధించిన అంశంలో మాత్రం ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు బీజేపీ, జనసేన పార్టీలు భిన్నంగా స్పందించాయి. జనసేన అధినేత పవన్ ఏమో నేరుగా వెళ్లి రోడ్డుపైన ఆందోళన చేశారు. జనసేన శ్రేణులు కూడా టీడీపీకి మద్దుతుగా వీధుల్లోకి వచ్చాయి. ఆందోళన చేస్తున్నాయి. కానీ బీజేపీ మాత్రం టీడీపీ బంద్‌కు తమ మద్దతు లేదని అధికారికంగా ప్రకటించింది. ఒకే అంశంపైన ఒకే కూటమికి చెందిన రెండు పార్టీలు భిన్నంగా స్పందించడంతో కాసింత అయోమయం నెలకొంది. ఇంతకీ రెండు పార్టీలు ఎందుకలా స్పందించాయి?