తెలుగుదేశం పార్టీ(TDP) యువ నేత నారా లోకేష్‌(Nara Lokesh) ఎక్కడ? పది రోజులుగా ఆయన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో లేరు. ఢిల్లీలో ఉంటున్నట్టుగా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబును(Chandrababu) ఎలాగైనా సరే బయటకు తీసుకురావాడానికి అనువైన మార్గాల వెతుకులాటలో లోకేష్‌ ఉన్నారట! ఢిల్లీలో లీగల్‌ ఎక్స్‌పర్ట్స్‌తో ఈ విషయంపైనే సుదీర్ఘంగా చర్చిస్తున్నారట!

తెలుగుదేశం పార్టీ(TDP) యువ నేత నారా లోకేష్‌(Nara Lokesh) ఎక్కడ? పది రోజులుగా ఆయన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో లేరు. ఢిల్లీలో ఉంటున్నట్టుగా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబును(Chandrababu) ఎలాగైనా సరే బయటకు తీసుకురావాడానికి అనువైన మార్గాల వెతుకులాటలో లోకేష్‌ ఉన్నారట! ఢిల్లీలో లీగల్‌ ఎక్స్‌పర్ట్స్‌తో ఈ విషయంపైనే సుదీర్ఘంగా చర్చిస్తున్నారట! వివిధ రాజకీయపార్టీల నాయకులతో లోకేష్‌ కలుస్తారని ఇంతకు ముందు టీడీపీ వర్గాలే చెప్పుకొచ్చాయి. కానీ ఇప్పటి వరకు లోకేష్‌ ఏ నేతను కలవలేదు. ఇదిలా ఉంటే నారా లోకేష్‌ను కూడా అరెస్ట్‌ చేయడానికి రంగం సిద్ధమయ్యిందనే వార్తలు వస్తున్నాయి. టీడీపీ అనుకూల పత్రికలు కూడా ఈ విషయాన్నే చెబుతున్నాయి. లోకేష్‌ అరెస్ట్‌ అయితే పరిస్థితి ఏమిటి? బ్రాహ్మణి(Brahmini) రంగంలోకి దిగుతారా? యువగళం పాదయాత్రను ఆమె కంటిన్యూ చేస్తారా? అన్న చర్చ కూడా వచ్చింది. అయితే వీటన్నింటికీ తెర దించుతూ నారా లోకేష్‌ ఓ మాటన్నారు. ఎక్కడైతే యువగళం పాదయాత్ర ఆగిపోయిందో అక్కడ్నుంచే తాను పాదయాత్ర కొనసాగించాలని అనుకుంటున్నానని లోకేష్‌ చెప్పారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని క్యాడర్‌కు సూచించారు. వచ్చే వారం నుంచి యువగళం పాదయాత్ర ప్రారంభం కాబోతున్నదని ఆయన హింట్ ఇచ్చారు. అప్పటి వరకు ఆయన ఢిల్లీలోనే ఉంటారన్నది సమాచారం. తనమీద వస్తున్న అభియోగాలను ఎదుర్కొంటూనే పాదయాత్ర చేయాలని లోకేష్‌ అనుకుంటున్నారట! అసలు లోకేష్‌ ఆలోచనలు ఏమిటి? పాదయాత్ర వెనుక ఉన్న వ్యూహమేమిటి? ఈ వీడియోలో తెలుసుకుందాం!

Updated On 25 Sep 2023 12:03 AM GMT
Ehatv

Ehatv

Next Story