Nara Lokesh Escape : నారా లోకేశ్ పారిపోయారా..?
తెలుగుదేశంపార్టీ(TDP) యువనేత నారా లోకేశ్(Nara Lokesh) పారిపోయారా? సీఐడీ అధికారులకు దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్నారా? ఓ వర్గం మీడియాలో జరుగుతున్న ప్రచారం ఇది! లోకేశ్ గత కొంతకాలంగా ఢిల్లీలో(Delhi) ఉంటున్నారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ప్రారంభానికి ముందు ఆయన ఢిల్లీకి వెళ్లారు. అక్కడ పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు. చంద్రబాబు అరెస్ట్‌కు(Chandrababu Arrest) సంబంధించిన వ్యవహారంపై పోరాటం చేయాలంటూ వారికి పిలుపునిచ్చారు.

Nara Lokesh Escape
తెలుగుదేశంపార్టీ(TDP) యువనేత నారా లోకేశ్(Nara Lokesh) పారిపోయారా? సీఐడీ అధికారులకు దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్నారా? ఓ వర్గం మీడియాలో జరుగుతున్న ప్రచారం ఇది! లోకేశ్ గత కొంతకాలంగా ఢిల్లీలో(Delhi) ఉంటున్నారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ప్రారంభానికి ముందు ఆయన ఢిల్లీకి వెళ్లారు. అక్కడ పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు. చంద్రబాబు అరెస్ట్‌కు(Chandrababu Arrest) సంబంధించిన వ్యవహారంపై పోరాటం చేయాలంటూ వారికి పిలుపునిచ్చారు. పార్లమెంట్ వేదికగా టీడీపీ ఎంపీలు చంద్రబాబు అరెస్ట్ అక్రమమని మాట్లాడారు. ఎంపీలకు ఒక దిశానిర్దేశం చేయడానికి ఢిల్లీకి వెళ్లారని, కొంత మంది కేంద్ర పెద్దలకు కలిసే ప్రయత్నం చేస్తున్నారనే వార్తలు వచ్చాయి. ఢిల్లీ నుంచే లోకేశ్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఢిల్లీలో ఉన్నప్పుడే చంద్రబాబుకు ప్రాణహానీ ఉందంటూ ట్వీట్ చేశారు. రాజమండ్రి జైలులో డెంగ్యూతో ఓ ఖైదీ చనిపోయాడని, చంద్రబాబుకు కూడా అటువంటి ప్రమాదం ఉందని, చంద్రబాబుకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని, ఆయనను చంపడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఢిల్లీ నుంచే ఆరోపించారు. తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ఏపీ పరిస్థితులను వివరించారు. తాను ఎక్కడికి పారిపోలేదని, సీఐడీ అధికారులు(CID Officials) ఢిల్లీకి వచ్చి తనను అరెస్ట్ చేయవచ్చని సవాల్ విసిరారు. ఇన్ని చేసిన లోకేశ్ ఇప్పుడెందుకు కనిపించడం లేదు? ఇంతకీ లోకేశ్ ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు?
