బీఆర్‌ఎస్‌(BRS) పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌(KTR) కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ(AP Politics) దుమారాన్ని రేపాయి. చంద్రబాబు అరెస్ట్‌(Chandrababu) విషయంపై ఆయన మాట్లాడుతూ, ఆయన అరెస్ట్‌పై హైదరాబాద్‌లో ఆందోళనలు, నిరసనలు చేయడం సరికాదన్నారు.

బీఆర్‌ఎస్‌(BRS) పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌(KTR) కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ(AP Politics) దుమారాన్ని రేపాయి. చంద్రబాబు అరెస్ట్‌(Chandrababu) విషయంపై ఆయన మాట్లాడుతూ, ఆయన అరెస్ట్‌పై హైదరాబాద్‌లో ఆందోళనలు, నిరసనలు చేయడం సరికాదన్నారు. అది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రెండు పార్టీల మధ్య గొడవని, దాంతో తమకేమిటి సంబంధమని ప్రశ్నించారు. లోకేశ్‌ తనకు ఫోన్‌ చేసినప్పుడు కూడా ఇదే విషయాన్ని చెప్పానని కేటీఆర్‌ తెలిపారు. కేటీఆర్‌ వ్యాఖ్యలను సహజంగానే తెలుగుదేశం పార్టీ ఖండించింది. అయితే ఈ రోజు ఖమ్మం పర్యటనకు వెళ్లిన కేటీఆర్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు. సీనియర్‌ ఎన్టీఆర్‌ను(Sr.NTR) ఆకాశానికెత్తారు. ఎన్టీ రామరావు అన్న పేరులోనే పవర్‌ ఉందని, ఆ పేరు ఉన్నందుకే తాను రెండుసార్లు మంత్రిని అయ్యాయని కేటీఆర్‌ అన్నారు. రాముడు, కృష్ణుడు అంటే రామారావేనంటూ చెప్పుకొచ్చిన కేటీఆర్‌ ఆయన హ్యాట్రిక్‌ సాధించలేకపోయారని, ఆయన శిష్యుడు కేసీఆర్‌ మాత్రం హ్యాట్రిక్‌ కొట్టడానికి రెడీగా ఉన్నారని అన్నారు. కేసీఆర్‌(KCR) హ్యాట్రిక్‌ సాధిస్తే గురువుగా ఎన్టీఆర్‌ సంతోషిస్తారని అంటూ ఎన్టీఆర్‌ సంతోషం కోసం బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని అన్నారు. కేటీఆర్‌ వ్యాఖ్యల వెనుక అంతరార్థమేమిటి? ఎన్టీఆర్‌ను ఎందుకంత పొగడాల్సి వచ్చింది?

Updated On 30 Sep 2023 7:23 AM GMT
Ehatv

Ehatv

Next Story