Jagan Vs Chandrababu : ఆంధప్రదేశ్ ఎన్నికలు ... కలవని కూటమి
ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) జగన్మోహన్‌రెడ్డిని(Jagan Mohan Reddy) గద్దె దింపడం కోసం తెలుగుదేశంపార్టీ(TDP), జనసేన పార్టీ(Janasena), బీజేపీలు(BJP) కూటమి కట్టాయి. ప్రస్తుతం ఎన్నికల సమరాంగణంలో జగన్ ఓ పక్కన, ఎన్డీయే మరో పక్కన నిల్చున్నాయి. సిద్ధం పేరుతో జగన్మోహన్‌రెడ్డి ఇప్పటికే నాలుగు ప్రాంతాలలో సభలను నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) జగన్మోహన్‌రెడ్డిని(Jagan Mohan Reddy) గద్దె దింపడం కోసం తెలుగుదేశంపార్టీ(TDP), జనసేన పార్టీ(Janasena), బీజేపీలు(BJP) కూటమి కట్టాయి. ప్రస్తుతం ఎన్నికల సమరాంగణంలో జగన్ ఓ పక్కన, ఎన్డీయే మరో పక్కన నిల్చున్నాయి. సిద్ధం పేరుతో జగన్మోహన్‌రెడ్డి ఇప్పటికే నాలుగు ప్రాంతాలలో సభలను నిర్వహించారు. మిగతా 21 జిల్లాలలో మేమంతా సిద్ధం పేరుతో సభలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతీ జిల్లాలో ఓ భారీ బహిరంగ సభ, చిన్నపాటి రోడ్ షోలను నిర్వహిస్తూ వెళుతున్నారు జగన్. పది రోజులుగా జగన్ మేమంతా సిద్ధం పేరుతో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నెల 25వ తేదీతో ఈ సభలు ముగుస్తాయి. ఆ తర్వాత ఎంపిక చేసుకున్న నియోజకవర్గాలలో జగన్ పర్యటనలు, సభలు ఉంటాయి. మరోవైపు ప్రజాగళం పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు(Chandrababu) కూడా కొన్ని జిల్లాలలో పర్యటించారు. సభలు, రోడ్‌షోలలో పాల్గొంటున్నారు. అయితే చంద్రబాబు ప్రచారశైలిని గమనించినవారికి ఒక విషయం స్పష్టమవుతోంది. పోరు జగన్- చంద్రబాబు మధ్యనే ఉన్నట్టుగా కనిపిస్తున్నదే తప్ప కూటమి వర్సెస్ జగన్‌లా అగుపించడం లేదు. కూటమికి సంబంధించిన నాయకులు చంద్రబాబు డయాస్‌పై కనిపించడం లేదు. అసలు వారిని వేదికపైకి రానిస్తున్నారో లేదో కూడా తెలియదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తన మానాన తను ప్రచారం చేసుకుంటున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాన్ కూడా పిఠాపురం కేంద్రంగా ఎన్నికల ప్రచారంలో దిగారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలా ఎవరికి వారుగా ప్రచారం చేసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అసలు కూటమి ఉందా అన్న అనుమానం కలుగుతోంది.