కొన్ని రోజుల కిందట మహిళల అక్రమ రవాణా అంటూ ఓ వివాదాస్పద వ్యాఖ్య చేసిన పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) మళ్లీ అలాంటి ఓ మాట అనేశారు. వలంటీర్లు ఇచ్చిన డేటా ఆధారంగా ఏపీలో మహిళలను అక్రమంగా తరలిస్తున్నారని, తనకు కేంద్ర ఇంటిలెజెన్స్‌ ఈ సమాచారం ఇచ్చిందని పవన్‌ చెప్పుకొచ్చారు. దీనిపై అప్పట్లో చాలా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. వాలెంటీర్లు(Volunteer) ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో(andhra pradesh) మిస్సింగ్‌లతో పోలిస్తే మహారాష్ట్రలోనో గుజరాత్‌లోనో ఇంకా ఎక్కువ సంఖ్యలో మిస్సింగ్‌లు ఉన్నాయి. ఇప్పుడు మరో ఓ వ్యాఖ్య చేసి మళ్లీ విమర్శల పాలయ్యారు పవన్‌.

కొన్ని రోజుల కిందట మహిళల అక్రమ రవాణా అంటూ ఓ వివాదాస్పద వ్యాఖ్య చేసిన పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) మళ్లీ అలాంటి ఓ మాట అనేశారు. వలంటీర్లు ఇచ్చిన డేటా ఆధారంగా ఏపీలో మహిళలను అక్రమంగా తరలిస్తున్నారని, తనకు కేంద్ర ఇంటిలెజెన్స్‌ ఈ సమాచారం ఇచ్చిందని పవన్‌ చెప్పుకొచ్చారు. దీనిపై అప్పట్లో చాలా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. వాలెంటీర్లు(Volunteer) ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో(andhra pradesh) మిస్సింగ్‌లతో పోలిస్తే మహారాష్ట్రలోనో గుజరాత్‌లోనో ఇంకా ఎక్కువ సంఖ్యలో మిస్సింగ్‌లు ఉన్నాయి. ఇప్పుడు మరో ఓ వ్యాఖ్య చేసి మళ్లీ విమర్శల పాలయ్యారు పవన్‌. మీడియా మొత్తం చంద్రబాబు అరెస్ట్(Chandrababu arrest) హడావుడిలో ఉంటే జనసేన అధినేత మాట్లాడిన మాటలు సంచలనం రేకెత్తించాయి. సుమారు రెండు వేల మంది కిరాయి గుండాలను, క్రిమినల్స్‌ను ప్రభుత్వం దింపిందని, వీరితో 50 మందిని చంపించే ప్రయత్నం(Murder attempt) చేసిందని పవన్‌ చెప్పుకొచ్చారు. తనకెలా ఈ విషయం తెలిసిందంటే అంటూ మళ్లీ పాత పాటే పాడారు. కేంద్ర ఇంటెలిజెన్స్‌ పవన్‌కు ఈ విషయం చెప్పిందని పవన్‌ తెలిపారు. ప్రజలను భయభ్రాంతులను చేయడానికే ఈ పథకం వేసిందని చెప్పారు. అసలు పవన్‌ అన్న మాటలేమిటో, అందులో ఎంత మేరకు నిజముందో ఈ వీడియోలో చూడండి.

Updated On 11 Sep 2023 4:34 AM GMT
Ehatv

Ehatv

Next Story