High Court shock To Nara Lokesh : ఢిల్లీకి సీఐడీ .. లోకేష్ అరెస్ట్..?
తెలుగుదేశం పార్టీకి(TDP) మరో బిగ్ షాక్ తగిలింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు(Nara Lokesh) సీఐడీ(CID) అధికారులు నోటీసు ఇవ్వబోతున్నారు. అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్(Amaravati Inner Ring Road) అలైన్‌మెంట్ కుంభకోణం కేసులో నారా లోకేశ్ పేరును ఏ 14గా చేరుస్తూ ఈ మధ్య విజయవాడ కోర్టులో ఏపీ సీఐడీ మెమో దాఖలు చేసింది.
తెలుగుదేశం పార్టీకి(TDP) మరో బిగ్ షాక్ తగిలింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు(Nara Lokesh) సీఐడీ(CID) అధికారులు నోటీసు ఇవ్వబోతున్నారు. అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్(Amaravati Inner Ring Road) అలైన్‌మెంట్ కుంభకోణం కేసులో నారా లోకేశ్ పేరును ఏ 14గా చేరుస్తూ ఈ మధ్య విజయవాడ కోర్టులో ఏపీ సీఐడీ మెమో దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో లోకేశ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు. అయితే ఏపీ హైకోర్టు ఈ పిటిషన్‌ను డిస్పోజ్ చేసింది. అంతేకాదు ఈ కేసులో లోకేష్‌కు నోటీసులు ఇచ్చి విచారించాలని ఏపీ సీఐడీని ఆదేశించిన కోర్టు.. మరోవైపు విచారణకు సహకరించాల్సిందేనని లోకేశ్‌కు చెప్పింది.ఈ క్రమంలోనే లోకేశ్‌కు 41-ఏ కింద నోటీసులు ఇచ్చి విచారణ జరపాలని హైకోర్టు ఆదేశించింది. ఆ ఆదేశాలను అనుసరించి నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీ బయల్దేరింది ఏపీ సీఐడీ. ఇప్పుడేం జరగబోతున్నది?