తెలుగుదేశంపార్టీ(TDP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(Chandrababu) అరెస్ట్‌పై చాలా మంది స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొన్ని రాజకీయ పార్టీలు కూడా స్పందించాయి. జనసేన(Janasena), కమ్యూనిస్టు పార్టీలతో పాటు బీజేపీ(BJP) కూడా రియాక్టయ్యింది. అరెస్ట్‌ జరిగిన తీరు బాగోలేదని చెప్పారు. సినీ పరిశ్రమకు చెందిన కె.రాఘవేంద్రరావు, అశ్వినీదత్‌, కె.ఎస్‌.రామారావు, మురళీమోహన్‌, బండ్ల గణేశ్‌ వంటి వారు కూడా మాట్లాడారు.

తెలుగుదేశంపార్టీ(TDP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(Chandrababu) అరెస్ట్‌పై చాలా మంది స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొన్ని రాజకీయ పార్టీలు కూడా స్పందించాయి. జనసేన(Janasena), కమ్యూనిస్టు పార్టీలతో పాటు బీజేపీ(BJP) కూడా రియాక్టయ్యింది. అరెస్ట్‌ జరిగిన తీరు బాగోలేదని చెప్పారు. సినీ పరిశ్రమకు చెందిన కె.రాఘవేంద్రరావు, అశ్వినీదత్‌, కె.ఎస్‌.రామారావు, మురళీమోహన్‌, బండ్ల గణేశ్‌ వంటి వారు కూడా మాట్లాడారు. దేశ వ్యాప్తంగా ఐటీ ఉద్యోగులు ధర్నాలు చేశారని తెలుగుదేశంపార్టీకి చెందిన మీడియా తెలిపింది. వందకు పైగా దేశాలలో చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా నిరసనలు జరిగాయని పేర్కొంది. ఇలాంటి సందర్భంలో తెలుగుదేశంపార్టీకి సంబంధించి, టీడీపీ కోసం పని చేసి, ఆ తర్వాత లీగల్‌గా వివిధ హోదాలలో పని చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిని చేపట్టిన ఎన్‌.వి.రమణ ఎందుకు స్పందించడంలేదన్నది చాలా మందికి వస్తున్న సందేహం.ఎన్‌.వి.రమణ(NV Ramana) రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తి. ఆయన స్పందించాల్సిన అవసరం లేదు. ఆయనకు టీడీపీతో సత్సంబంధాలు ఉన్నాయని చాలా మంది చెబుతుంటారు. ఈయన నియామకాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ సీఎం జగన్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే! ఆయన ఒక వర్గం కోసం పని చేస్తున్నారని లేఖలో చెప్పారు జగన్‌. లేఖలో ఇంకా చాలా చాలా విషయాలను జగన్‌ ప్రస్తావించారు. అదలా ఉంచితే, చంద్రబాబు అరెస్ట్‌పై రమణ ఎందుకు మౌనంగా ఉంటున్నారు? అక్రమ అరెస్టయితే అదైనా చెప్పాలికదా! లేదూ సక్రమమే అంటూ ఆ మాటైనా అనాలి కదా! ఎందుకు రమణ మౌనంగా ఉంటున్నారు? ఈ వీడియోలో తెలుసుకుందాం!

Updated On 29 Sep 2023 6:09 AM GMT
Ehatv

Ehatv

Next Story