Eenadu Newspaper : ఈనాడు సంచలన నిర్ణయం...ప్రభుత్వ ప్రకటనలు వెయ్యం...:
ఈనాడు(Enadu) దినపత్రిక రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రముఖం. రాజకీయపరమైన విభేదాలు ఉన్నప్పటికీ ప్రభుత్వాలు ఆ పత్రికకు ప్రకటనలు(adverstisements) ఇస్తూ ఉంటాయి. అత్యధిక సర్క్యూలేషన్ ఉన్న పత్రిక కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వాల్సిందే! ఆపడం కుదరదు. గతంలో ఈనాడును వ్యతిరేకించిన కాంగ్రెస్(congress) ప్రభుత్వాలు కానీ, ప్రస్తుతం ఏపీలో ఉన్న జగన్మోహన్‌రెడ్డి(Jagan) సర్కారు కానీ వారికి ఇష్టం లేకపోయినా సరే ప్రభుత్వ ప్రకటనలను ఇచ్చాయి, ఇస్తున్నాయి.
ఈనాడు(Eenadu) దినపత్రిక రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రముఖం. రాజకీయపరమైన విభేదాలు ఉన్నప్పటికీ ప్రభుత్వాలు ఆ పత్రికకు ప్రకటనలు(adverstisements) ఇస్తూ ఉంటాయి. అత్యధిక సర్క్యూలేషన్ ఉన్న పత్రిక కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వాల్సిందే! ఆపడం కుదరదు. గతంలో ఈనాడును వ్యతిరేకించిన కాంగ్రెస్(congress) ప్రభుత్వాలు కానీ, ప్రస్తుతం ఏపీలో ఉన్న జగన్మోహన్‌రెడ్డి(Jagan) సర్కారు కానీ వారికి ఇష్టం లేకపోయినా సరే ప్రభుత్వ ప్రకటనలను ఇచ్చాయి, ఇస్తున్నాయి.గడచినా నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన ప్రకటనలు ఈనాడు దిన పత్రికలు కనిపిస్తూ వస్తున్నాయి. చాలాసార్లు ఫ్రంట్ పేజీ ప్రకటనలు కూడా ఈనాడులో కనిపించాయి. ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి కార్యక్రమం ప్రకటన రూపంలో ఈనాడులో కనిపించేది. అలాంటిది ఈమధ్య ఈనాడులో ప్రభుత్వానికి చెందిన ప్రకటనలు కనిపించడం లేదు. చాలా పత్రికలలో మొదటి పేజీలో కనిపించిన సర్కారు ప్రకటన ఈనాడులో కనిపించకపోవడం ఆశ్చర్యం. ప్రభుత్వం కక్షకట్టి మరీ ఈనాడుకు ప్రకటనలను నిలిపివేసిందా? అన్న అనుమానం కలిగింది. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు. మరి నిజమేమిటి?