నారా లోకేశ్‌(Nara Lokesh Arrest) అరెస్ట్‌కు రంగం సిద్ధమయ్యిందా...? అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు అరెస్ట్‌(Chandrababu Arrest) తర్వాత లోకేశ్‌ ఢిల్లీ వెళ్లారు. దాదాపు 11 రోజులుగా ఢిల్లీలోనే ఉంటున్నారు. చంద్రబాబుకు లీగల్ ఎయిడ్‌ తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు. కేసు నుంచి ఆయనను బయటకు తీసుకురావడానికి కావాల్సిన మార్గాలను వెతుకుతున్నారు.

నారా లోకేశ్‌(Nara Lokesh Arrest) అరెస్ట్‌కు రంగం సిద్ధమయ్యిందా...? అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు అరెస్ట్‌(Chandrababu Arrest) తర్వాత లోకేశ్‌ ఢిల్లీ వెళ్లారు. దాదాపు 11 రోజులుగా ఢిల్లీలోనే ఉంటున్నారు. చంద్రబాబుకు లీగల్ ఎయిడ్‌ తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు. కేసు నుంచి ఆయనను బయటకు తీసుకురావడానికి కావాల్సిన మార్గాలను వెతుకుతున్నారు. న్యాయనిపుణులతో మాట్లాడుతున్నారు. రాజకీయపార్టీల అధినేతలను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి లోకేశ్‌ ఢిల్లీకి ఎందుకు వెళ్లారో, అక్కడ ఏం చేస్తున్నారో టీడీపీ కూడా ఇప్పటి వరకు చెప్పలేదు. గత రెండు మూడు రోజులుగా లోకేశ్‌ జాడ కూడా కనిపించడం లేదు. లోకేశ్‌ ఏం చేస్తున్నారనే దానిపైన ఎలాంటి సమాచారము లేదు. యువగళం పాదయాత్ర ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడ్నుంచే మళ్లీ పాదయాత్ర కొనసాగించాలని లోకేశ్‌ అనుకుంటున్నారట!అందుకు సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ లోకేశ్ కూడా అరెస్ట్‌ అవుతారనే వార్తలు వస్తున్నాయి. వీటిలో ఎంత వరకు నిజముంది?

Updated On 26 Sep 2023 5:38 AM GMT
Ehatv

Ehatv

Next Story