Chandrababu Arrest : రేపో ఎల్లుండో తనను అరెస్ట్ చేయవచ్చు అంటూ కీలక వ్యాఖ్యలు
తెలుగుదేశం పార్టీ(TDP) అధినేత చంద్రబాబు నాయుడు(Chandra babu) ఐటీ నోటీసులపై(IT Notices)పరోక్షంగా స్పందించారు. రేపో ఎల్లుండో తనను అరెస్ట్(Arrest) చేయవచ్చు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. నిప్పులా బతికిన తనపైనే తప్పుడు కేసులు పెడుతున్నారంటూ చంద్రబాబు నాయుడు ఆరోపించారు.

Chandrababu Arrest
తెలుగుదేశం పార్టీ(TDP) అధినేత చంద్రబాబు నాయుడు(Chandra babu) ఐటీ నోటీసులపై(IT Notices)పరోక్షంగా స్పందించారు. రేపో ఎల్లుండో తనను అరెస్ట్(Arrest) చేయవచ్చు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. నిప్పులా బతికిన తనపైనే తప్పుడు కేసులు పెడుతున్నారంటూ చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా రాయదుర్గం(Raidurgam) లో వివిధ వర్గాల ప్రజలతో నిర్వహించిన ప్రజా వేదిక చర్చా కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాక్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగిస్తోందని మండిపడ్డారు. జగన్ అరాచక పాలనను అంతమెుందించేందుకు ఇంటికొకరు చొప్పున ముందుకు రావాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఒకటి, రెండు రోజుల్లో తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని.. అంతేకాదు తనపై కూడా దాడి చేస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
