తెలుగుదేశంపార్టీ(TDP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(Chandrababu) ఆరోగ్యంపై కొన్ని రోజులుగా రకరకాల వార్తలు వస్తున్నాయి. ఆయన ఆరోగ్య(Health) పరిస్థితి ఏ మాత్రం బాగోలేదని, ఆయన అయిదు నుంచి ఆరు కిలోల వరకు బరువు తగ్గిపోయారని(Weight Loss) కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

తెలుగుదేశంపార్టీ(TDP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(Chandrababu) ఆరోగ్యంపై కొన్ని రోజులుగా రకరకాల వార్తలు వస్తున్నాయి. ఆయన ఆరోగ్య(Health) పరిస్థితి ఏ మాత్రం బాగోలేదని, ఆయన అయిదు నుంచి ఆరు కిలోల వరకు బరువు తగ్గిపోయారని(Weight Loss) కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. పార్టీ నాయకులు కూడా ఇదే మాట అంటున్నారు. ఆయనను తక్షణం ఆసుపత్రికి తరలించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఓ మనిషి నెల రోజుల్లో అయిదు కిలోల బరువు తగ్గడమన్నది సాధారణ విషయం కాదు. తీవ్రంగా పరిగణించాల్సిన విషయం ఇది! ఆరోగ్యంలో పెను మార్పులు వస్తే తప్ప బరువు తగ్గడమన్నది జరగదు. ఆయన జైలుకు వెళ్లి సుమారు 37 రోజులు అవుతోంది. జైళ్ల శాఖ అధికారులు మాత్రం చంద్రబాబు బరువు తగ్గలేదని, పైపెచ్చు కిలో బరువు పెరిగారని అంటున్నారు. ఆయన శరీరంపై దద్దుర్లు వచ్చిన మాట నిజమని అన్నారు. ఆయనను పరీక్షించడానికి జైలులోనే చర్మవ్యాధి నిపుణులు ఉన్నారని చెప్పారు. అసలు చంద్రబాబుకు ఏమైంది? ప్రభుత్వం ఏమి చెబుతోంది..? టీడీపీ ఏమని వాదిస్తోంది. ఈ వీడియోలో చూద్దాం

Updated On 14 Oct 2023 6:30 AM GMT
Ehatv

Ehatv

Next Story