మజ్లిస్‌ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ(Asaduddin Owaisi) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(Jagan mohan Reddy) పాలన చాలా బాగుందని కితాబిచ్చారు. చంద్రబాబుకు(Chandrababu) అరెస్టయ్యి హాపీగా జైల్లో ఉన్నారని చెప్పారు.

మజ్లిస్‌ పార్టీ(Majlis Party) అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ(Asaduddin Owaisi) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(Jagan mohan Reddy) పాలన చాలా బాగుందని కితాబిచ్చారు. చంద్రబాబుకు(Chandrababu) అరెస్టయ్యి హాపీగా జైల్లో ఉన్నారని చెప్పారు. చంద్రబాబు ఎందుకు అరెస్టయ్యారో రాష్ట్రానికి, దేశానికి తెలుసని ఒవైసీ పేర్కొన్నారు. ఆయన తప్పు చేశారు కాబట్టే జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు జగన్మోహన్‌రెడ్డి వెంటనే ఉన్నారని, ఉంటారని తెలిపారు. చంద్రబాబు నాయుడును నమ్మవద్దని ఏపీ ప్రజలకు సూచించారు. అసదుద్దీన్‌ ఇంకా ఏమన్నారో తెలుసుకుందాం!

Updated On 26 Sep 2023 5:30 AM
Ehatv

Ehatv

Next Story