స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో(Skill Development Case) టీడీపీ(TDP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu) దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై(Quash Petition) విచారణ వాయిదా పడింది. మంగళవారం వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం ఈ నెల 13వ తేదీ శుక్రవారానికిమధ్యాహ్నం రెండు గంటలకు విచారణ వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో(Skill Development Case) టీడీపీ(TDP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu) దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై(Quash Petition) విచారణ వాయిదా పడింది. మంగళవారం వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం ఈ నెల 13వ తేదీ శుక్రవారానికిమధ్యాహ్నం రెండు గంటలకు విచారణ వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. నిన్న కూడా చంద్రబాబు తరపున ఇద్దరు సీనియర్‌ లాయర్లు హరీశ్‌ సాల్వే(Harish Salve), సిద్ధార్థ్‌ లూథ్రాలు(Siddharth Luthra) వాదనలు వినిపించారు. ఈ రోజు ఏపీ సీఐడీ(AP CID) తరపున సీనియర్‌ న్యాయవాది ముకుల్ రోహత్గీ(Mukul Rohathgi) వాదనలు వినిపించారు. చంద్రబాబు తరపున హరీష్‌ సాల్వే వాదనలు వినిపించారు. సీఐడీ తరపున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. రోహత్గీ వాదనలు విన్న ధర్మాసనం విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. అయితే సోమ, మంగళవారాలలో జరిగిన వాదనలు మొత్తం 17A చుట్టూ తిరిగాయి. 17A చంద్రబాబుకు వర్తిస్తుందని ఆయన తరపు న్యాయవాదులు వాదిస్తుంటే, అది ఆయనకు వర్తించదని రోహత్గీ అంటున్నారు. 17A.. అవినీతి పరులను కాపాడుకోవడం కోసం కాదని, నిజాయితీ పరులను కాపాడుకోవడం కోసమేనని, చంద్రబాబుకు 17ఏ వర్తించదన్నది రోహత్గీ వాదన. చంద్రబాబు తరపు న్యాయవాదులు పదే పదే చెబుతూ వస్తున్న మాట 17A. దాన్ని ఒక బ్రహ్మాస్త్రంగా భావిస్తున్నారు వారు! ఇదే చంద్రబాబుకు తీరని నష్టం తెచ్చిపెడుతున్నదన్నది పరిశీలకుల అభిప్రాయం. అసలు 17A ఏమిటి? ఎందుకు చంద్రబాబు లాయర్లు దాన్ని పట్టుకుని వేలాడుతున్నారు? అన్న వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం!

Updated On 10 Oct 2023 6:08 AM GMT
Ehatv

Ehatv

Next Story