వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో(YSRCP) చేరి పట్టుమని పది రోజులన్నా కాలేదు అప్పుడే ఆ పార్టీకి రాజీనామా చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్‌ అంబటి రాయుడు(Ambati Rayudu). ఈ విషయాన్ని ఎక్స్‌ (Twitter) ద్వారా తెలిపిన అంబటి రాయుడు కొంతకాలంపాటు రాజకీయాలకు(Politics) దూరంగా ఉండాలనుకుంటున్నానని తెలిపాడు. వారం రోజుల కిందట వైసీపీలో చేరి ఉండవచ్చు కానీ చాన్నాళ్లుగా ఆయన వైసీపీ అనుకూల వైఖరినే అవలంబిస్తూ వచ్చాడు. ప్రధానంగా గుంటూరు నగరంలో విస్తృతంగా పర్యటనలు చేస్తూ వచ్చారు. జగన్మోహన్‌రెడ్డి(Jagan Mohan Reddy) ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రచారం చేశారు. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేద ప్రజలకు మరింత మేలు చేయబోతున్నాయని చెప్పుకొచ్చారు. ఏపీ సీఎం జగన్‌ను ఆకాశానికెత్తారు. ఈ రోజు అనూహ్యంగా ఆయన పార్టీకి రాజీనామా చేశాడు.

రాజకీయాల నుంచి వైదొలుగుతున్నానని, ప్రస్తుతానికి ఏ పార్టీలో చేరడం లేదని తెలిపాడు. అంబటిరాయుడు తీసుకున్న ఈ నిర్ణయం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అంబటి రాయుడు క్రికెట్‌లో ఉన్నప్పట్నుంచి చూస్తున్నవారికి మాత్రం పెద్దగా ఆశ్చర్యం కలగలేదు. ఎందుకంటే మొదట్నుంచి అంబటి ఇలాంటి నిర్ణయాలే తీసుకునేవాడు. అందుకే ఎక్కువకాలం క్రికెట్‌లో(Cricket) మనుగడ సాగించలేకపోయాడు. అంబటికి కొంచెం టెంపర్‌ ఎక్కువ. ఆవేశం కూడా ఎక్కువే! సరే, ఇప్పుడు అంత ఆకస్మికంగా వైసీపీ నుంచి అంబటి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అంబటిరాయుడు గుంటూరు(Guntur) లోక్‌సభ(Lok Sabha) స్థానం నుంచి పోటీ చేయాలని అనుకున్నాడు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ కూడా గంటూరు నుంచి అంబటిని బరిలో దింపాలనే అనుకుంది. కాపు సామాజికవర్గానికి చెందిన అంబటి రాయుడు గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తే జనసేన, టీడీపీ కూటమిని దెబ్బకొట్టవచ్చు, కాపు సామాజికవర్గం ఓట్లు జనసేనకు వెళ్లకుండా అడ్డుకోవచ్చు అని వైసీపీ అధినాయకత్వం భావించింది.

అయితే వైసీపీ కూడా తన నిర్ణయాన్ని మార్చుకుంది. గుంటూరు లోక్‌సభ టికెట్‌ అంబటికి ఇవ్వడం లేదని చెప్పేసింది. గంటూరు టికెట్‌పై చాలా ఆశలు పెట్టుకున్న అంబటికి ఇది కష్టమనిపించింది. అందుకే పార్టీకి రాజీనామా చేశారు. వైసీపీ ఎందుకు గుంటూరు టికెట్‌ ఇవ్వలేమని చెప్పింది? గుంటూరు టికెట్‌ను లావు శ్రీకృష్ణదేవరాయలుకు ఇవ్వాలని వైసీపీ డిసైడయ్యింది. శ్రీకృష్ణదేవరాయలు ప్రస్తుతం నరసరావుపేట ఎంపీగా ఉన్నారు. ఇంతకు ముందు గుంటూరులో ఓడిపోవడానికి సామాజికవర్గపు లెక్కలేనని వైసీపీ భావిస్తోంది. గడచిన ఎన్నికల్లో కమ్మ సామాజికవర్గానికి చెందిన గల్లా జయదేవ్‌ విజయం సాధించారు. సామాజికవర్గమే అక్కడ టీడీపీ గెలవడానికి కారణమయ్యిందనేది వైసీపీ భావన! ఇటీవల సర్వేలలో కూడా అక్కడ కమ్మ సామాజికవర్గం ఓట్లు అని తేలింది. అక్కడ నుంచి కమ్మ సామాజికర్గానికి చెందిన అభ్యర్థిని బరిలో దింపాలని వైసీపీ నిర్ణయించింది. అందుకే అంబటి రాయుడిని కాకుండా శ్రీకృష్ణదేవరాయలును పోటీకి దింపాలని అనుకుంటోంది. ఇదే విషయాన్ని శ్రీకృష్ణదేవరాయలకు కూడా చెప్పేసింది. అంబటిని మచిలీపట్నం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయించాలని అనుకుంది. అంబటి రాయుడుకు తనకు గుంటూరు టికెట్‌ దక్కడం లేదని తెలియగానే పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. నిజానికి మచిలీపట్నం నుంచి కాపు సామాజికవర్గానికి చెందినవారు చాలా మంది గెలిచారు. టీడీపీ నుంచి కొనకళ్ల నారాయణ, కాంగ్రెస్‌ నుంచి రామకృష్ణ, బాలశౌరి అక్కడ్నుంచి గెలిచారు. అయితే మచిలీపట్నానికి వెళ్లడం అంబటికి ఇష్టం లేదు కాబట్టే పార్టీకి రాజీనామా చేశారు. ఇదే సమయంలో గుంటూరు నుంచి అంబటిని బరిలో దింపాలని తెలుగుదేశం పార్టీ అనుకుంటోందట! వారం పది రోజులు ఆగితే దీనిపై ఓ క్లారిటీ వస్తుంది.

Updated On 6 Jan 2024 4:09 AM GMT
Ehatv

Ehatv

Next Story