ABN Radha Krishna : చంద్రబాబు అరెస్ట్...ఆర్కే సంబరాలు
ఎప్పటిలాగే ఆంధ్రజ్యోతి(andhra jyoti) అధినేత రాధాకృష్ణ(Radhakrishna) అసత్యాలతో తన కొత్త పలుకును నింపేశారు. ఆ విధంగా తనకు ఇష్టమైన చంద్రబాబుకు(Chandrababu), ఆయన సారథ్యంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి(TDP) నష్టం కలిగిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్‌పై ఆయన రాసిన రాతల్లో ఏదీ నిజం లేదు. చంద్రబాబు సత్య హరిశ్చంద్రుడికి సొంత తమ్ముడైనట్టుగా రాసుకొచ్చారు.
ఎప్పటిలాగే ఆంధ్రజ్యోతి(andhra jyoti) అధినేత రాధాకృష్ణ(Radhakrishna) అసత్యాలతో తన కొత్త పలుకును నింపేశారు. ఆ విధంగా తనకు ఇష్టమైన చంద్రబాబుకు(Chandrababu), ఆయన సారథ్యంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి(TDP) నష్టం కలిగిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్‌పై ఆయన రాసిన రాతల్లో ఏదీ నిజం లేదు. చంద్రబాబు సత్య హరిశ్చంద్రుడికి సొంత తమ్ముడైనట్టుగా రాసుకొచ్చారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమమంటూ, అసలు ఈ కేసు నిలవదని చెప్పారు. జగన్(Jagan) అరెస్టవ్వడం సక్రమమేని పుంఖాను పుంఖాలుగా రాయడమే కాకుండా అవినీతి అనే ముద్రను ఆయనపై వేసిన రాధాకృష్ణ తన అభిమాన నేత అరెస్ట్ కావడాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. టెక్నికల్ అంశాలు మాట్లాడుతూ చంద్రబాబుకు ఇందులో ఏ పాత్ర లేదని అంటున్నారు. చంద్రబాబును అర్థరాత్రి అరెస్ట్ చేయాల్సిన అవసరమేముందని రాసిన రాధాకృష్ణకు చంద్రబాబును ఉదయం ఆరు గంటలకు అరెస్ట్ చేసిన విషయం తెలియదని ఎలా అనుకోవాలి? రాష్ట్ర ప్రజలందరూ చంద్రబాబు అరెస్ట్‌ను(chandrababu) చూశారు. మరి ఇలా అబద్ధపు రాతలు రాస్తే జనాలు నవ్వుకుంటారన్న సోయి కూడా లేకపోతే ఎలా? రాజకీయ పార్టీలు డబ్బులు తీసుకోవడం సహజమేనంటూ చంద్రబాబు నేరాన్ని కరెక్టేనంటూ సర్టిఫికెట్ ఇచ్చే ప్రయత్నం చేశారు రాధాకృష్ణ.. ఇంకా తన కొత్త పలుకులో ఇంకేం రాశారో ఈ వీడియోలో చూడండి...