తెలుగుదేశంపార్టీ అధినేత(TDP), మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు(Chandrababu) ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో(AP High Court) మరోసారి చుక్కెదురయ్యింది. ఆయనకు సంబంధించిన బెయిల్‌ పిటిషన్‌పై(BAil Petition) విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.

తెలుగుదేశంపార్టీ అధినేత(TDP), మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు(Chandrababu) ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో(AP High Court) మరోసారి చుక్కెదురయ్యింది. ఆయనకు సంబంధించిన బెయిల్‌ పిటిషన్‌పై(BAil Petition) విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో(Skill Development Scam) బెయిల్‌ ఇవ్వాలని చంద్రబాబు పిటిషన్ వేశారు. ఏసీబీ కోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ వేసిన ఈ పిటిషన్‌పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. కౌంటర్‌ దాఖలు చేయాలసి సీఐడీని(CID) ఆదేశించింది. ఇప్పటికే సీఐడీ అధికారులు చంద్రబాబును విచారించారని, ఇక విచారించడానికి ఏమీ లేదని, ఒకవేళ వారికి ఏమైనా సమాచారం కావాలంటే ఆయన సహకరిస్తారని చంద్రబాబు తరపు లాయర్లు హైకోర్టుకు విన్నవిస్తూ బెయిల్‌ను అభ్యర్థించారు. చంద్రబాబుపై న్యాయస్థానాలలో ఉన్న కేసులకు సంబంధించి పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దాం.

Updated On 12 Oct 2023 4:15 AM GMT
Ehatv

Ehatv

Next Story