తెలుగుదేశం పార్టీ(TDP) కార్యకర్తలకు, అభిమానులకు, ఆ పార్టీకి కొమ్ముకాస్తున్న మీడియాకు ఇది ఇబ్బంది కలిగించే వార్తే! టీడీపీ అధినేత చంద్రబాబుకు(Chandrababu) మరో 11 రోజుల పాటు రిమాండ్‌ను(Remand) విధించింది ఏసీబీ(ACB Court) న్యాయస్థానం.

తెలుగుదేశం పార్టీ(TDP) కార్యకర్తలకు, అభిమానులకు, ఆ పార్టీకి కొమ్ముకాస్తున్న మీడియాకు ఇది ఇబ్బంది కలిగించే వార్తే! టీడీపీ అధినేత చంద్రబాబుకు(Chandrababu) మరో 11 రోజుల పాటు రిమాండ్‌ను(Remand) విధించింది ఏసీబీ(ACB Court) న్యాయస్థానం. అక్టోబర్‌ 5వ తేదీ వరకు ఆయన రాజమండ్రి సెంట్రల్‌ జైలులో(Rajahmundry central Jail) ఉండాల్సి ఉంటుంది.అయిదు రోజుల పాటు కస్టడీ(Custody) అడిగితే ఏసీబీ కోర్టు రెండు రోజులే కస్టడీకి ఇచ్చింది. ఇంకా 130 నుంచి 150 ప్రశ్నల వరకు చంద్రబాబును అడగాల్సి ఉందని సీఐడీ అధికారులు చెబుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. వాటిలో చాలా ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలు చెప్పలేదు. తాము అడగాల్సిన ప్రశ్నలను పూర్తిగా అడగలేకపోయామని సీడీఐ అధికారులు చెబుతున్నారు. చంద్రబాబు తరఫు న్యాయవాదులు వరుసగా పిటిషన్లు వేస్తుండటంపై ఏసీబీ కోర్టు న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారట! ఆ సంగతి అటుంచితే సీఐడీ అధికారులు కనుక కస్టడీ పిటిషన్‌ వేస్తే ఎలా అన్న ఆందోళన టీడీపీ శ్రేణులలో మొదలైంది.మొత్తంగా చంద్రబాబు మరి కొన్నాళ్లపాటు జైలులోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో ఈ వీడియోలో చూద్దాం.

Updated On 24 Sep 2023 11:47 PM GMT
Ehatv

Ehatv

Next Story