BJP Master Plan : పొత్తు వెనుక బీజేపీ మాస్టర్ ప్లాన్!
మొత్తానికి తెలుగుదేశం పార్టీ(TDP) బీజేపీతో(BJP) పొత్తును సంపాదించింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో(AP Elections) టీడీపీ-జనసేన(Janasena)-బీజేపీ కూటమి అధికారపక్షంతో తలపడబోతున్నది. ఎన్డీయేలోకి(NDA) టీడీపీని ఆహ్వానించామని, ఉభయపార్టీల మధ్య పొత్తు కుదిరిందని బీజేపీ అధికారికంగా ప్రకటించింది. అయితే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాతో(Amit shah) సమావేశం తర్వాత దాదాపు నెల రోజుల పాటు మౌనంగా ఉన్న భారతీయ జనతాపార్టీ ఇంత ఆకస్మికంగా టీడీపీతో పొత్తుకు(TDP Alliance) ఓకే చెప్పింది.
మొత్తానికి తెలుగుదేశం పార్టీ(TDP) బీజేపీతో(BJP) పొత్తును సంపాదించింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో(AP Elections) టీడీపీ-జనసేన(Janasena)-బీజేపీ కూటమి అధికారపక్షంతో తలపడబోతున్నది. ఎన్డీయేలోకి(NDA) టీడీపీని ఆహ్వానించామని, ఉభయపార్టీల మధ్య పొత్తు కుదిరిందని బీజేపీ అధికారికంగా ప్రకటించింది. అయితే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాతో(Amit shah) సమావేశం తర్వాత దాదాపు నెల రోజుల పాటు మౌనంగా ఉన్న భారతీయ జనతాపార్టీ ఇంత ఆకస్మికంగా టీడీపీతో పొత్తుకు(TDP Alliance) ఓకే చెప్పింది. దీని వెనుక ఏం జరిగి ఉంటుంది? రాజకీయవర్గాలలో ఈ పొత్తుపై బోల్డంత చర్చ జరుగుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఢిల్లీకి వెళ్లి, రెండు రోజుల పాటు అక్కడే ఎదురుతెన్నులు కాచి పొత్తును సాధించుకున్నారు. మొదటి రోజు చంద్రబాబు బీజేపీ అధినాయకత్వాన్ని కలిశారు కానీ అప్పుడు వారు ఓ నిర్ణయానికి రాలేదు. టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల కలిగే లాభాల గురించి లెక్కలుసుకున్నారు. అంతేకాదు కూటమిని తామే లీడ్ చేస్తామని, ఎవరు ఏ స్థానం నుంచి పోటీ చేయాలో తామే నిర్ణయిస్తామని బీజేపీ నాయకత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే తెలుగుదేశంపార్టీ ప్రకటించిన 94 స్థానాల నుంచి కూడా తమకు కావాలిసినవి తాము తీసుకుంటామని కరాఖండిగా చెప్పింది. వాటిల్లో అవసరమైతే మీరు అభ్యర్థులను మార్చుకోవాల్సి వుంటుంది అని టీడీపీకి స్పష్టం చేసింది. ఇలాంటి సవాలక్ష కండిషన్లను బీజేపీ పెట్టింది. ఈ కండిషన్లకు ఒప్పుకుంటేనే మీతో పొత్తు పెట్టుకుంటామని, ఇష్టం లేకపోతే ఇప్పుడే వెళ్లిపోవవచ్చని టీడీపీతో స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెప్పింది బీజేపీ. పొత్తుకు బీజేపీ నిరాకరించిందని, బీజేపీతో పొత్తు కుదరలేదని, పొత్తు ఉండదని బయటకు తెలిస్తే రాజకీయంగా తమకు తీవ్ర నష్టం కలుగుతుందని టీడీపీ భావించింది. దాంతో బీజేపీ చెప్పిన అన్ని కండిషన్లకు టీడీపీ తల ఊపింది. అప్పుడు కానీ టీడీపీతో పొత్తుకు బీజేపీ ఒప్పుకోలేదు. మోదీ, అమిత్ షా, నడ్డాలతో(Nadda) చంద్రబాబు సమావేశమయ్యారు. ఆ కండిషన్లు ఏమిటన్నది ఇంకా బయటకు రాలేదు. కాకపోతే మనకు అందిన విశ్వసనీయ సమాచారం ఏమిటంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అసెంబ్లీకి పోటీ చేస్తారట! పురంధేశ్వరిని అసెంబ్లీకి పంపించాలని బీజేపీ అనుకుంటోంది. ఇంతకు ముందు ఆమె లోక్‌సభ సభ్యురాలిగా ఉన్నారు. కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు. అయితే ఇప్పుడు ఆమెను అసెంబ్లీ బరిలో దింపడమన్నది బీజేపీ మాస్టర్ ప్లాన్‌లో భాగం. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే బీజేపీ ఈ నిర్ణయానికి వచ్చింది. ఇప్పుడు పురంధేశ్వరి అసెంబ్లీకి పోటీ చేస్తే చంద్రబాబునాయుడు పరిస్థితి ఏమిటి? లోకసభ నుంచి పోటీ చేయమని చంద్రబాబు నాయుడును బీజేపీ ఆదేశిందట! ఎందుకో, బీజేపీ వ్యూహమేమిటో ఈ వీడియోలో చూడండి.