ఇటీవల ప్రధాన మీడియా(Media) కంటే సోషల్‌ మీడియాకే(Social Media) ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. యువత సామాజిక మాధ్యమాలలో వచ్చే వార్తలనే విశ్వసిస్తున్నది. అందుకే రాజకీయపార్టీలు సోషల్‌ మీడియాను ఎక్కువగా వాడుకుంటున్నాయి. కొన్ని పార్టీలు అయితే సొంతంగా సోషల్‌ మీడియాను హ్యాండిల్‌ చేస్తున్నాయి. అయితే కొందరు సోషల్‌ మీడియా కార్యకర్తలు మాత్రం అతి చేస్తున్నారు. జనసేతో(Jenasena) పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళుతున్నామని ప్రకటించినప్పటి నుంచి తెలుగుదేశంపార్టీ(TDP), జనసేన కార్యకర్తల మధ్య సోషల్‌ మీడియాలో పెద్ద యుద్ధమే జరుగుతోంది.

ఇటీవల ప్రధాన మీడియా(Media) కంటే సోషల్‌ మీడియాకే(Social Media) ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. యువత సామాజిక మాధ్యమాలలో వచ్చే వార్తలనే విశ్వసిస్తున్నది. అందుకే రాజకీయపార్టీలు సోషల్‌ మీడియాను ఎక్కువగా వాడుకుంటున్నాయి. కొన్ని పార్టీలు అయితే సొంతంగా సోషల్‌ మీడియాను హ్యాండిల్‌ చేస్తున్నాయి. అయితే కొందరు సోషల్‌ మీడియా కార్యకర్తలు మాత్రం అతి చేస్తున్నారు. జనసేతో(Jenasena) పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళుతున్నామని ప్రకటించినప్పటి నుంచి తెలుగుదేశంపార్టీ(TDP), జనసేన కార్యకర్తల మధ్య సోషల్‌ మీడియాలో పెద్ద యుద్ధమే జరుగుతోంది. కొందరు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు పనిగట్టుకుని వారిని రెచ్చగొడుతున్నారన్నది టీడీపీ అనుమానం. దీనివల్ల ఆ పార్టీకే నష్టం జరుగుతోంది. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ గ్రహించింది. అందుకే సోషల్‌ మీడియా కార్యకర్తలకు టీడీపీ ఓ విన్నపం(Request) చేసింది. మరో మూడేళ్లలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో టీడీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలు పార్టీకి పనికివచ్చే విధంగానే పోస్టులు పెట్టాలని సూచించింది. పార్టీ చేసిన మంచి పనులు, అభివృద్ధి, సంక్షేమం, పార్టీ నాయకత్వం దూరదృష్టి, వారి విజయాలపైనే ఫోకస్‌ చేయాలని కోరింది. వైసీపీ(YCP) నాయకుల వల్ల ప్రజలకు జరుగుతున్న కష్టాలు, వారు ఎదుర్కొనే ఇబ్బందులు, విధాన నిర్ణయాలలో తప్పులు, అధికార పార్టీ అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలపై సోషల్‌ మీడియాలో నిలదీయాలని తెలిపింది. తెలంగాణ రాజకీయాలపై అంటే బీఆర్‌ఎస్‌(BRS), కాంగ్రెస్‌(Congress), బీజేపీలపై(BJP) స్పందించకూడదని విజ్ఞప్తి చేసింది. అలాగే సినిమా నటులపై(Movie Actors), జనసేన(Janasena) పార్టీపై, సంబంధం లేని విషయాలపై రియాక్టవ్వకుండా ఉండాలని సూచించింది. వచ్చే మూడు నెలలు వివాదాల జోలికి వెళ్లకూడదని హెచ్చరించింది. ఇంకా ఎక్కువ కష్టపడి పార్టీ విజయంలో ఎవరికి ఎంత సమయం దొరికితే అంత సమయం సద్వినియోగం చేసుకుని పార్టీని విజయ తీరాలకు చేర్చడంలో తమవంతు కృషి చేయాలని పిలుపునిచ్చింది టీడీపీ.

Updated On 26 Dec 2023 7:54 AM GMT
Ehatv

Ehatv

Next Story