Vivekanand Case : వివేకానందరెడ్డి కేసును ఆ మీడియా వదిలేసిందా?
వై.ఎస్.వివేకానందరెడ్డి(YS Vivek Case) హత్య కేసు గడచిన కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్‌లోని(Andhra Pradesh) ప్రధాన మీడియాకు ప్రధాన వార్తగా ఉండింది. ప్రధాన మీడియాలో ప్రతి రోజు అదే ఇష్యూ పైన వార్తలు, అదే అంశంపైన చర్చలు ఉండేవి. వివేకా హత్య కేసు వార్త తప్ప మరే వార్త లేదన్నట్టుగా ఆ మీడియా దాన్నే చూపిస్తూ వచ్చింది. దాన్నే ప్రచురిస్తూ వచ్చింది.
వై.ఎస్.వివేకానందరెడ్డి(YS Vivek Case) హత్య కేసు గడచిన కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్‌లోని(Andhra Pradesh) ప్రధాన మీడియాకు ప్రధాన వార్తగా ఉండింది. ప్రధాన మీడియాలో ప్రతి రోజు అదే ఇష్యూ పైన వార్తలు, అదే అంశంపైన చర్చలు ఉండేవి. వివేకా హత్య కేసు వార్త తప్ప మరే వార్త లేదన్నట్టుగా ఆ మీడియా దాన్నే చూపిస్తూ వచ్చింది. దాన్నే ప్రచురిస్తూ వచ్చింది. వివేకానందరెడ్డి హత్య వెనుక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(YS Jagan) ప్రమేయం ఉందంటూ నిరాధారణమైన ఆరోపణలతో కూడిన వార్త కథనాలు రాస్తూ వచ్చాయి. అలాంటి ఆరోపణలనే ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ కూడా చేస్తూ వచ్చింది. వివేకా కూతురు సునీతపై ఎక్కడాలేని సానుభూతిని చూపిస్తు , ఆమెకు అన్యాయం జరిగిందని ఆక్రోశించింది. ఆమెకు న్యాయం జరగాలి అంటూ క్యాంపైన్ కూడా చేసింది ఆ మీడియా! నిజానికి తన తండ్రి హత్య వెనుక ఎవరున్నారో తెలుసుకోవడానికి సునీత సిన్సియర్‌గానే పోరాడారు. హైకోర్టుకు వెళ్లారు.సీబీఐ విచారణ కోరారు. కేసును ఏపీ నుంచి పక్క రాష్ట్రానికి మార్చాలని అభ్యర్థించారు. తనకు న్యాయం జరగడం లేదంటూ ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ చెప్పారు. తన పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఆమె పోరాటానికి ఏపీలోని ఓ వర్గం మీడియా మద్దతు ఇస్తూ వచ్చింది. వైఎస్ వివేక హత్య కేసును అడ్డం పెట్టుకుని అధికారపక్షం వైసీపీపై(YCP) దాడులు చేస్తూ వచ్చింది. వార్తలు వండి ప్రచురించాయి. రేపో మాపో జగన్ జైలుకు వెళ్లడం ఖాయమంటూ పాఠకులను, ప్రేక్షకులను నమ్మించాయి. భారతీరెడ్డి(Bharathi Reddy) కూడా జైలుకు వెళతారంటూ వార్తలు రాశాయి.అవినాశ్‌రెడ్డి హత్య వెనుక ఉన్నారని సీబీఐ కంటే ముందే తేల్చేసింది. ఆల్ ఆఫ్ సడన్ గత కొద్ది రోజులుగా ఈ వార్తను పట్టించుకోవడం మానేసింది ఓ వర్గం మీడియా. తెలుగుదేశం పార్టీ కూడా ఈ అంశంపై నోరు విప్పడం లేదు. ఎందుకు సైలెంట్‌గా ఉన్నాయో తెలియదు. యువగళం పాదయాత్ర మొత్తం హూ కిల్డ్ బాబాయ్ అంటూ ప్రశ్నించిన నారా లోకేశ్ కూడా ఇప్పుడు సైలెంటయ్యారు. కారణమేమిటో తెలియాల్సి ఉంది. గతంలో జగన్మోహన్‌రెడ్డి అరెస్ట్ అవుతారు. జగన్‌కు సంబంధం ఉంది అంటూ రాస్తూ రోజుకో కథనాన్ని డిస్‌ప్లే చేసిన ఆ మీడియా రెండు రోజుల కిందట సునీత, ఆమె భర్తపైన కేసు నమోదు అయితే దాన్ని పట్టించుకోలేదు. నిజానికి ఇది సునీతకు , ఆమె భర్తకు ఇబ్బంది కలిగించే వార్త. కోర్టు డైరెక్షన్‌తో కేసు నమోదు అయితే ఆ మీడియాకు ఎందుకు వార్త కాకుండా పోయింది? వార్త వేయలేదు సరే, కనీసం సునీతకు మద్దతుగానైనా నిలవాలి కదా! జగన్ అక్రమంగా కేసు పెట్టించారని ఎందుకు రాయలేదు? ఓ వర్గం మీడియా ఎందుకు ఇలా చేస్తున్నదో ఈ వీడియోలో చూద్దాం.