హిమబిందు...ఏసీబీ కోర్టు(ACB Court) న్యాయమూర్తి. మూడు నెలల కిందట ఆమె పైన తెలుగుదేశంపార్టీ(TDP), తెలుగుదేశంపార్టీ సోషల్ మీడియా(Social media), తెలుగుదేశంపార్టీ అనుకూల మీడియా చాలా పెద్ద ఎత్తున దుష్ర్పచారం చేశాయి. ఆమెపై వ్యక్తిగతంగా దాడులకు దిగాయి. ఆమెకు రాజకీయరంగును పులిమాయి. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ(YSRCP) కోవర్ట్‌ అంటూ ఆరోపించాయి. ఆమెకు జగన్మోహన్‌రెడ్డితో(CM Jagan) సంబంధాలు ఉన్నాయంటూ రాశాయి.

హిమబిందు...ఏసీబీ కోర్టు(ACB Court) న్యాయమూర్తి. మూడు నెలల కిందట ఆమె పైన తెలుగుదేశంపార్టీ(TDP), తెలుగుదేశంపార్టీ సోషల్ మీడియా(Social media), తెలుగుదేశంపార్టీ అనుకూల మీడియా చాలా పెద్ద ఎత్తున దుష్ర్పచారం చేశాయి. ఆమెపై వ్యక్తిగతంగా దాడులకు దిగాయి. ఆమెకు రాజకీయరంగును పులిమాయి. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ(YSRCP) కోవర్ట్‌ అంటూ ఆరోపించాయి. ఆమెకు జగన్మోహన్‌రెడ్డితో(CM Jagan) సంబంధాలు ఉన్నాయంటూ రాశాయి. ఆమె ఏదో ప్రలోభాలకు లోబడి చంద్రబాబునాయుడుకు రిమాండ్‌ను ఇచ్చారంటూ అడ్డమైన రాతలన్నీ రాశాయి. ఆమెపైన రాసిన రాతలు, ఆమెపై సోషల్‌ మీడియాలో పెట్టిన వికృత పోస్టులు ఆ కేసును పరిశీలిస్తున్న చాలా మందికి, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు కూడా ఇబ్బందిని కలిగించాయి. కొంతమంది రాష్ట్రపతి ద్రౌపది(Draupati Murmu) ముర్ము దగ్గరకు ఈ విషయాన్ని తీసుకెళ్లారు. రాష్ట్రపతి వెంటనే స్పందించి ఆమెపై ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిని గుర్తించండి, వారిపై చర్యలు తీసుకోండి, విచారణ జరపించండి అని చీఫ్‌ సెక్రటరీని ఆదేశించారు. రాష్ట్రపతి దృష్టికి ఈ విషయం వెళ్లింది అంటే చంద్రబాబు ఫాలోవర్లు ఎంత నీచానికి ఒడిగట్టారో అర్థమవుతోంది. ఓ న్యాయమూర్తి ఎలాంటి తీర్పు ఇవ్వాలో ? ఎలా ప్రవర్తించాలో ? న్యాయం ఎలా చెప్పాలో టీడీపీ అనుకూల పత్రికలు చెప్పుకురావడం దారుణం, దురదృష్టకరం. ఆమె తీసుకున్న నిర్ణయం సరైంది కాదని టీడీపీ నడిపిస్తున్న పత్రికలు రాసుకురావడం శోచనీయం. అయితే నిన్న 17ఎపై సుప్రీంకోర్టులో ఇద్దరు న్యాయమూర్తులు భిన్నమైన తీర్పులు ఇచ్చారు. పనిలో పనిగా హిమబిందు తీసుకున్న నిర్ణయం సరైందేనని సుప్రీంకోర్టు చెప్పంది.

Updated On 18 Jan 2024 2:54 AM GMT
Ehatv

Ehatv

Next Story