తెలంగాణకు(Telangana) ఒక కొత్త పరిశ్రమ రాబోతున్నది. సింటెక్స్(Sintex) అనే కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో 350 కోట్ల రూపాయలతో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. వాస్తవానికి వెల్ స్పన్ గ్రూప్(Well Span Group) అనే సంస్థకు భాగస్వామిగా ఉన్నటువంటి సింటెక్స్ తన తయారీ యూనిట్ కోసం 350 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనుంది.

తెలంగాణకు(Telangana) ఒక కొత్త పరిశ్రమ రాబోతున్నది. సింటెక్స్(Sintex) అనే కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో 350 కోట్ల రూపాయలతో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. వాస్తవానికి వెల్ స్పన్ గ్రూప్(Well Span Group) అనే సంస్థకు భాగస్వామిగా ఉన్నటువంటి సింటెక్స్ తన తయారీ యూనిట్ కోసం 350 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనుంది. సింటెక్స్ తయారు యూనిట్ నెలకొల్పడం వల్ల దాదాపు వెయ్యి మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రాబోతున్నాయి.ఇది నిజంగానే మీడియాకు ఒక వార్త. హైదరాబాద్‌ చుట్టుపక్కల ఓ కొత్త కంపెనీ రాబోతున్నదంటే వార్తే కదా! కానీ ఆంధ్రజ్యోతికి(andhra jyoti) మాత్రం ఇది వార్తగా అనిపించలేదు. కేటీఆర్‌(KTR) పైన కోపమో, లేక బీఆర్‌ఎస్‌(BRS) పైన కోపమో, అదీ కాకపోతే తెలంగాణపై ఉన్న అక్కసో తెలియదు కానీ ఇంత పెద్ద వార్త ఆ పేపర్లో అసలు కనిపించలేదు. ప్రభుత్వం ప్రజావ్యతిరేక పనులు చేస్తోందని, ఆ వార్తలు తాము రాస్తున్నందుకే మాపై కక్ష కట్టిందని ఆంధ్రజ్యోతి అధినేత చెబుతూ వస్తుంటారు. కానీ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు సంబంధించిన వార్త దాచేస్తారా ఎవరైనా? ఇష్టం ఉంటే ట్రిపుల్‌ కాలమ్‌ ఐటమ్‌గా వెయ్యి, ఇష్టం లేకపోతే కనీసం సింగిల్‌ కాలమ్‌లోనైనా వార్తను ప్రజెంట్‌ చెయ్యి. అంతే కానీ టోటల్‌గా వార్తనే లేపేస్తే ఎలా? వార్త వార్తే కదా! దాన్ని దాచేస్తే ఎలా? అసలు ఆంధ్రజ్యోతి సంస్థలు ఎందుకు ఇలా చేస్తున్నాయో, వెనక ఉన్న ఉద్దేశాలు ఏమిటో ఈ వీడియోలో చూద్దాం.

Updated On 25 Sep 2023 12:04 AM GMT
Ehatv

Ehatv

Next Story