Chennakesava Reddy on Porn : ఎమ్మెల్యేలు కూడా పోర్న్ చూస్తున్నారన్న ఎమ్మెల్యే..!
వైసీపీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి(Chennakesava Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు కూడా సెల్‌ఫోన్లు, ట్యాబ్‌లలో పోర్న్(Porn) చూస్తున్నారని ఆయన నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులకు ట్యాబ్, ల్యాప్‌టాప్‌లు(Laptops) ఇస్తుంటే కొందరు పనిగట్టుకొని విమర్శిస్తున్నారన్నారు. బడుగుబలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు సాంకేతికతను అందిపుచ్చుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని సీఎం జగన్(CM Jagan) భావిస్తుంటే కాళ్లలో కట్టెలు పెడుతున్నారన్నారు.
వైసీపీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి(Chennakesava Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు కూడా సెల్‌ఫోన్లు, ట్యాబ్‌లలో పోర్న్(Porn) చూస్తున్నారని ఆయన నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులకు ట్యాబ్, ల్యాప్‌టాప్‌లు(Laptops) ఇస్తుంటే కొందరు పనిగట్టుకొని విమర్శిస్తున్నారన్నారు. బడుగుబలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు సాంకేతికతను అందిపుచ్చుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని సీఎం జగన్(CM Jagan) భావిస్తుంటే కాళ్లలో కట్టెలు పెడుతున్నారన్నారు. విద్యార్థులకు ల్యాప్‌టాప్, ట్యాబ్‌లు ఇస్తే పోర్న్ చూస్తారన్న విమర్శలు సరికావని చెన్నకేశవరెడ్డి అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఉన్నతంగా ఎదిగి విదేశీ విద్యను అందిపుచ్చుకునేలా తయారు చేయాలని సీఎం జగన్ భావిస్తున్నారని.. ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేసి ఆయన ఆశయాన్ని దెబ్బగొట్టేందుకు కొందరు తప్పుడు కథనాలు రాస్తున్నారని చెప్పారు. ఈరోజుల్లో ఎమ్మెల్యేలు(MLAs), అధికారులు కూడా పోర్న్ చూస్తున్నారని.. ఒకరిద్దరు విద్యార్థులు తప్పుదారి పడితే.. దానిని సమాజానికి మొత్తం రుద్దితే ఎలా అని ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ప్రశ్నించారు. విద్యార్థులకు ట్యాబ్‌లు(Tabs) ఇస్తే చెడిపోతారన్న విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు.