ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ(AP BJP) చీఫ్‌ దగ్గుబాటి పురందేశ్వరిపై(Daggubati Purandeswari) వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ(YSRCP) నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) మరోసారి విరుచుకుపడ్డారు. ట్విట్టర్‌(Twitter) వేదికగా విమర్శలు కురిపించారు. ఆయన చేసిన ట్వీట్‌ ఏమిటంటే...'అమ్మా పురందేశ్వరి గారూ..

ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ(AP BJP) చీఫ్‌ దగ్గుబాటి పురందేశ్వరిపై(Daggubati Purandeswari) వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ(YSRCP) నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) మరోసారి విరుచుకుపడ్డారు. ట్విట్టర్‌(Twitter) వేదికగా విమర్శలు కురిపించారు. ఆయన చేసిన ట్వీట్‌ ఏమిటంటే...'అమ్మా పురందేశ్వరి గారూ.. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి(YSRTP) మీ మరిది గారి టీడీపీ(TDP) బహిరంగంగా మద్దతు ఇవ్వటాన్ని భరించలేక అక్కడ బీసీ నాయకుడు తన పదవికి రాజీనామా చేశాడు. కాంగ్రెస్‌కు నేరుగా మద్దతు పలుకుతున్న టీడీపీకి మీరు ఏపీలో నేరుగా మద్దతు పలుకుతున్నారు. అంటే... మీది కుటుంబ రాజకీయమా?. కుల రాజకీయమా? కుటిల రాజకీయమా?. లేక బీజేపీని వెన్నుపోటు పొడిచే మీ రాజకీయమా?’ అంటూ పురందేశ్వరిని తీవ్రంగా విమర్శించారు..ఇంకా మరో ట్వీట్‌లో ఆయన ఏమన్నారంటే 'పురందేశ్వరి పదవుల కోసం బీజేపీలోచేరి ఆ పార్టీని టీడీపీకి తాకట్టు పెట్టడానికి పనిచేస్తున్నారే కానీ ఆమెకు తన పార్టీపై ప్రేమ, అభిమానం లేవు. మొదట టీడీపీ..తర్వాత ఎన్టీఆర్ టీడీపీ, తర్వాత బీజేపీ, మళ్లీ కాంగ్రెస్.. మళ్లీ బీజేపీ.. ఇలా వరుసగా నాలుగుసార్లు పార్టీలు మారిన చరిత్ర పురందేశ్వరిది. బీజేపీలో చేరిన తర్వాతైనా ఆమె వల్ల ఒక్క ఓటు అయినా అదనంగా పార్టీకి వచ్చిందా అంటే...ఇంకా పార్టీ ఓట్లను టీడీపీకి మళ్లించారనే చెప్పాల్సి ఉంటుంది’ అంటూ దుయ్యబట్టారు.

Updated On 4 Nov 2023 4:30 AM GMT
Ehatv

Ehatv

Next Story