Vijay Sai Reddy Joining in BJP? : బీజేపీలోకి విజయసాయిరెడ్డి..?
వైసీపీకి ఈరోజు విజయసాయిరెడ్డి రాజీనామా చేయనున్నారు. ఉప రాష్ట్రపతికి తన రాజీనామా లేఖను ఇవ్వనున్నారు.
వైసీపీకి ఈరోజు విజయసాయిరెడ్డి రాజీనామా చేయనున్నారు. ఉప రాష్ట్రపతికి తన రాజీనామా లేఖను ఇవ్వనున్నారు. తాను ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటానన్నారు. కానీ విజయసాయిరెడ్డి బీజేపీలో చేరుతారన్న వార్తలు వస్తున్నాయి. తాను ఏపార్టీలో చేరేది లేదని చెప్పినప్పటికీ విజయసాయిరెడ్డి మాత్రం బీజేపీలో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి రాజీనామా వ్యవహారం ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామంగా కనిపిస్తుంది. విజయసాయిరెడ్డి(Vijay Sai Reddy) రాజీనామా అంశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. విజయసాయి రెడ్డి నేడు ఉప రాష్ట్రపతిని కలిసి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా లేఖ ఇవ్వనున్నారు.
2019 ఎన్నికల తర్వాత సుజనా చౌదరి(Sujana Chowdhary).. టీజీ వెంకటేష్(TG Venkatesh).. సీఎం రమేష్(Cm Ramesh).. గరికిపాటి రాంమోహన్ రావు(Garikapati rammoham).. టీడీపీ(TDP) నుంచి బీజేపీ(BJP)లో చేరారు. అయితే వీళ్ళు ఇంకా పదవి కాలం ఉండగానే బీజేపీలో చేరారు. అసలు టీడీపీకి రాజ్యసభలో ఒకరు కూడా లేరు. ఇప్పుడు ఇదే సీన్ వైసీపీ లో కనిపిస్తోంది. విజయ్ సాయిరెడ్డి పార్టీకి.. రాజ్యసభకు కూడా రాజీనామా ఇచ్చేశారురు.. వ్యవసాయం చేసుకుంటా అంటున్నారు. ఏపీ రాజ్యసభ సభ్యులకు ఈ పదవి అచ్చిరావడం లేదనే టాక్ నడుస్తోంది. అధికారం కోల్పోగానే గతంలో టీడీపీ నుంచి బీజేపీలోకి ఎంపీలు చేరారు. తాజాగా వైసీపీ రాజ్యసభ సభ్యలు మోపిదేవి, ఆర్.కృష్ణయ్య, బీద మస్తాన్ రావు ఆ పార్టీని వీడారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి కూడా తోడు కావడంతో రాజ్యసభలో వైసీపీ బలం ఐదుగురు సభ్యులకు చేరింది వ్యాపార అవసరాలు.. కేసులు వంటి కారణాలు బీజేపీలోకి చేరడానికి కారణమనే వాదన బలంగా వినిపిస్తోంది.