ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌లో (MLC Elections) క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడిన నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ (YSRCP). విప్‌ ఉల్లంఘించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు (sajjala rama krishna reddy). ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి, కోటం శ్రీధర్‌రెడ్డిపై వేటు వేస్తున్నట్టు ఆయన ప్రకటించారు.

ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌లో (MLC Elections) క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడిన నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ (YSRCP). విప్‌ ఉల్లంఘించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు (sajjala rama krishna reddy). ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి, కోటం శ్రీధర్‌రెడ్డిపై వేటు వేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ నలుగురు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ (TDP) అభ్యర్థికి ఓటు వేసినట్టు పార్టీ గుర్తించిందని సజ్జల చెప్పారు. అయితే గతంలో కూడా తెలుగుదేవం పార్టీ వైసీపీ ఎమ్మెల్యేలను (YCP MLA's) పార్టీలోకి తీసుకుంది.. అంతేకాకుండా వారికీ మంత్రి పదవులు కూడా ఆఫర్ చేసింది. తన పార్టీ గుర్తుపై గెలిచి ఇతరపార్టీకి ఓటేసిన ఎమ్మెల్యేలను జగన్ సస్పెండ్ చేయడం తప్పేమి కాదని కొందరు మద్దతిస్తుంటే.. మరి కొందరు మాత్రం 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు (Chandrababu)ఇలా సస్పెండ్ చేసే దమ్ముందా అని ప్రశ్నిస్తున్నారు.

Updated On 24 March 2023 8:04 AM GMT
Ehatv

Ehatv

Next Story