✕
YSRCP : ఏపీలోనే ఆ వెసులుబాటు ఎందుకు..? : పేర్నినాని
By YagnikPublished on 28 May 2024 10:09 PM GMT
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై సీఈవో ఇచ్చిన ప్రత్యేక గైడ్ లైన్స్ పై వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే పేర్నినాని అభ్యంతరం వ్యక్తం చేశారు

x
YCP senior leader and MLA Perninani objected to special guidelines given by the CEO on the counting of postal ballot votes.
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై సీఈవో ఇచ్చిన ప్రత్యేక గైడ్ లైన్స్ పై వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే పేర్నినాని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏ రాష్ట్రంలో లేనటువంటి వెసులుబాటు ఈ రాష్ట్రంలో ఎందుకు ఇచ్చారు.? కేంద్ర ఎన్నికల సంఘంలో లేని సడలింపులు ఏపీలో ఎందుకు ఇచ్చారు? అని ఈసీని ప్రశ్నించారు. ఒక పార్టీ కోరగానే ఇలాంటి గైడ్ లైన్స్ ఎలా ఇస్తారని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలని పేర్నినాని ఈసీని కోరారు.

Yagnik
Next Story