Sajjala Reaction On YS Sharmila : షర్మిల నిర్ణయంపై స్పందించిన సజ్జల
కాంగ్రెస్ పార్టీకి(Congress) వైఎస్సార్టీపీ(YSRTP) అధినేత్రి వైఎస్ షర్మిల(YS sharmila) మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయమై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramkrishna Reddy) స్పందించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌ను(Jagan) ఏ పార్టీ వేధించి అక్రమ కేసులు పెట్టిందో.. ఆ పార్టీతో షర్మిల కలిశారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీకి(Congress) వైఎస్సార్టీపీ(YSRTP) అధినేత్రి వైఎస్ షర్మిల(YS sharmila) మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయమై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramkrishna Reddy) స్పందించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌ను(Jagan) ఏ పార్టీ వేధించి అక్రమ కేసులు పెట్టిందో.. ఆ పార్టీతో షర్మిల కలిశారని అన్నారు. షర్మిల ఓ పార్టీకి అధ్యక్షురాలు.. ఆమె నిర్ణయాలు ఆవిడ ఇష్టం.. మాకు ఏపీ విషయాలే ముఖ్యమని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ వేధించిందని.. ఇబ్బందులు పెట్టిందని అందరికీ తెలుసనని సజ్జల అన్నారు.
వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల శుక్రవారం సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో(TS Elections 2023) వైఎస్ఆర్టీపీ పోటీ చేయడం లేదని ఆమె ప్రకటించారు. ఎన్నికల్లో పోటీకి తాము దూరంగా ఉంటున్నామని.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నామని తెలిపారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నామని.. తమ పార్టీ తరపున పలువురిని ఎన్నికల బరిలో నిలపాలని తాను అనుకున్నానని షర్మిల చెప్పారు. తాను ఎమ్మెల్యేగా గెలిచి, అసెంబ్లీలో అడుగు పెడతాననే పూర్తి నమ్మకం తనకు ఉందని తెలిపారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్(KCR) ఓడిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని.. అందుకే కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకే ఎన్నికల్లో పోటీ చేయకూడదని తాము నిర్ణయించామని చెప్పారు. కాంగ్రెస్ గెలుపు అవకాశాలను అడ్డకోకూడదనే ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నామని తెలిపారు. తన నిర్ణయాన్ని పార్టీ శ్రేణులందరూ అర్థం చేసుకోవాలని కోరారు.