గత కొన్ని రోజులుగా ఏపీలో(AP) అధికార పార్టీ వైసీపీకి(YCP) సంబంధించిన‌ అసంతృప్తులపై చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఓ ముగ్గురు ఎమ్మెల్యేలు త్వరలోనే టీడీపీలోకి(TDP) వెళ్ళబోతున్నారంటూ ప్రచారం జోరుగా సాగింది. త్వరలోనే వైసీపీ నేతలు భారీ ఎత్తున టీడీపీలో చేరబోతున్నారంటూ ఆ పార్టీ కూడా ప్రచారం చేసింది. దీంతో అసంతృప్తులు ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోననే ఉత్కంఠ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో నెల‌కొంది.

ఈ పరిణామాలపై ప్ర‌భుత్వ స‌ల‌హాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) స్పందిస్తూ.. ఏ పార్టీలోనైనా అసంతృప్తులు సహజమన్నారు. మా పార్టీ మంచి ఫామ్‌లో ఉంది కాబట్టే.. పోటీ చేయటానికి నాయకులు పెద్దసంఖ్యలో వస్తున్నారన్నారు. అసంతృప్తుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అసంతృప్తులు లేకపోతే అది చెల్లని పార్టీ అనుకుంటారని వ్యాఖ్యానించారు.

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించడమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్(CM Jagan) కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఓ వైపు సన్నిహితులు, ఆప్తులను కూడా మార్చేస్తార‌ని చ‌ర్చ జ‌రుగుతుండ‌గా.. మరో వైపు బుజ్జగింపుల ప్ర‌క్రియకు కూడా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసిన‌ట్లు తెలుస్తోంది. సొంత పార్టీ నాయకుల్లో ఉన్న అసంతృప్తి ఎన్నికల ముందు బయటపడే ప్రమాదం ఉందని కూడా సీఎం జగన్ ను కొందరు హెచ్చరిస్తూ ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో ఇంఛార్జ్‌ల‌ మార్పు ఇప్పటికే జరిగిపోయింది. ఇంకా అనేక నియోజకవర్గాల్లో ఇలాంటి మార్పులుంటాయనే ప్రచారం జరుగుతోంది. త్వరలోనే వీరు పార్టీని వీడే ప్రయత్నం చేస్తారని అంటున్నారు. ఏం జ‌రుగుతుంద‌నేది వేచి చూడాలి..!

Updated On 27 Dec 2023 5:59 AM GMT
Ehatv

Ehatv

Next Story