ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై(CM Jagan) షర్మిల(YS Sharmila) వ్యాఖ్యలకు గట్టి కౌంటర్‌ ఇచ్చారు ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna). షర్మిలను చూస్తే జాలి కలుగుతోందన్నారు. షర్మిల వాడిన సరికాదని.. అదొక భాషనా అని వ్యాఖ్యానించారు. షర్మిలకు కాంగ్రెస్‌ పార్టీ గురించి తెలియదన్నారు. చంద్రబాబును సీఎం చేసేందుకు షర్మిల కంకణం కట్టుకున్నట్లు అనిపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై(CM Jagan) షర్మిల(YS Sharmila) వ్యాఖ్యలకు గట్టి కౌంటర్‌ ఇచ్చారు ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna). షర్మిలను చూస్తే జాలి కలుగుతోందన్నారు. షర్మిల వాడిన సరికాదని.. అదొక భాషనా అని వ్యాఖ్యానించారు. షర్మిలకు కాంగ్రెస్‌ పార్టీ గురించి తెలియదన్నారు. చంద్రబాబును సీఎం చేసేందుకు షర్మిల కంకణం కట్టుకున్నట్లు అనిపిస్తోంది. కాంగ్రెస్‌తో(congress) చంద్రబాబు(chandrababu) కలిసి రాష్ట్రానికి అన్యాయం చేశారన్నారు. వైఎస్‌ఆర్ ఆశయాల కోసం సీఎం జగన్‌ కష్టపడి పనిచేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అటు రాష్ట్రానికి, వైఎస్‌ కుటుంబానికి అన్యాయం చేసిందని సజ్జల విమర్శించారు. జగన్‌పై పెట్టినవన్నీ అక్రమకేసులేనని గులాంనబీ ఆజాద్‌ అన్నారు. ప్రత్యేక హోదా చట్టంలో పెట్టకుండా రాష్ట్రానికి కాంగ్రెస్‌ అన్యాయం చేసిందన్నారు. ఏపీని అడ్డగోలుగా చీల్చింది కాంగ్రెస్‌ కాదా అని ప్రశ్నించారు. వైఎస్‌ఆర్‌ పేరును ఛార్జిషీట్‌లో కాంగ్రెస్‌లో చేర్చిందని ఆయన అన్నారు. వైఎస్‌ కుటుంబాన్ని కాంగ్రెస్‌ ఎన్నిరకాలుగా ఇబ్బందులో పెట్టిందో షర్మిల మర్చిపోయారా అని ప్రశ్నించారు.

విభజన సరిగా జరిగి ఉంటే ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఏముందన్నారు. రాష్ట్రాన్ని నిలువునా చీల్చి కాంగ్రెస్‌ మూల్యం చెల్లించుకుందని సజ్జల విమర్శించారు. గత ఎన్నికల్లో నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా కాంగ్రెస్‌కు రాలేదని ఆయన అన్నారు. అసలు షర్మిల నిన్న, మొన్న తెలంగాణలో వెలగబెట్టింది ఏంటో చెప్పాలన్నారు. తెలంగాణలో పోటీ చేస్తా, తెలంగాణకు సీఎం అవుతానంటూ కాలుకు బలపం కట్టుకుని తిరిగిన షర్మిల.. ఇప్పుడు ఏం చేస్తున్నారో చెప్పాలని సజ్జల అడిగారు. ఎవరి ప్రయోజనాలను కాపాడేందుకు షర్మిల ఏపీకి వచ్చిందో చెప్పాలని సజ్జల ప్రశ్నించారు. ఇప్పుడు ఏపీకి అన్యాయం చేసిన పార్టీలో చేరి ఏం చేస్తారో చూద్దామన్న ఆయన.. అసలు రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఉనికిలోనే లేదని సజ్జల ఎద్దేవా చేశారు. వైఎస్‌ఆర్‌ వారసుడిగా ప్రజల్లో జగన్‌ సుస్థిర స్థానాన్ని ఏర్పార్చుకున్నాడని సజ్జల మీడియాతో అన్నారు.

Updated On 21 Jan 2024 6:49 AM GMT
Ehatv

Ehatv

Next Story