Anchor Shyamala : అధికారి ప్రతినిధికాగానే పని మొదలు పెట్టిన యాంకర్ శ్యామల
వైసీపీ(YCP) నలుగురు కొత్త అధికార ప్రతినిధులను నియమించింది.
వైసీపీ(YCP) నలుగురు కొత్త అధికార ప్రతినిధులను నియమించింది. మాజీ మంత్రి ఆర్.కె.రోజా, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, జూపూడి ప్రభాకర్‌రావులను(Jupudi prabhakar) అధికార ప్రతినిధులుగా నియమించారు. ఈ జాబితాలో ప్రముఖ యాంకర్ శ్యామల(Anchor shyamla) కూడా చోటు దక్కడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మొన్నటి ఎన్నికల్లో శ్యామల పార్టీ కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. తనమీద టీడీపీ(TDP), జనసేన(Janasena) కార్యకర్తలు ఎంతగా దుష్ర్పచారం చేసినా, సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హనానికి పాల్పడినా శ్యామల మాత్రం ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. పిఠాపురానికి వెళ్లి పవన్ కల్యాణ్‌ను విమర్శించారు కూడా! వైసీపీకి ఆమె చేసిన సేవలను గుర్తించిన జగన్ ఇప్పుడు పార్టీ అధికార ప్రతినిధిగా ప్రమోట్ చేశారు.
అయితే అధికార ప్రతినిధి అయిన వెంటనే శ్యామల తన పని ప్రారంభించారు. ఏపీ సీఎం చంద్రబాబు(CM chandrababu), ఆయన కుటుంబంపై విరుచుకుపడ్డారు. వరద బాధితులకు జగన్(YS Jagan) సాయం చేయలేదన్న వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. పిల్లికి కూడా ఎప్పుడూ భిక్షం వేయని తండ్రీ కొడుకులంటూ చంద్రబాబు, లోకేష్‌పై విరుచుకుపడ్డారు. 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్ల వరకు సంపాదించిన చంద్రబాబు కుటుంబం ఎంత మందికి సాయం చేసిందో ఒక్కసారి చెప్తే ప్రజలు కూడా తెలుసుకుంటారన్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతల ఆస్తులు, హత్యలకు ఆ పార్టీ గూండాలు చేసిన సంగతి సూడో మెధావులకు కూడా తెలుసు కదా. 200 మంది టీడీపీ గూండాల దాడిలో గాయపడ్డ కార్యకర్తల కుటుంబాలకు జగన్ అండగా ఉన్నారు. విశాఖలోని ఓ ఫార్మా కంపెనీలో పేలుడు జరిగి 17 మంది చనిపోతే ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున జగన్ సాయం చేశారు. అదే ఘటనలో 41 మంది గాయపడితే ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున సాయం చేశారు. సుడో మేధావులకు ఇది కనపడలేదా అని శ్యామల ప్రశ్నించారు. విజయవాడ వరద బాధితులకు కోటి సాయమందించారు. అక్కడితో వదిలేయకుండా వారికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. పులివెందులలోని స్కూల్లో ఎంతో మంది పేద విద్యార్థులకు ఒక్క రూపాయి తీసుకోకుండా సాయం చేశారు. ఓదార్పుయాత్ర, పాద యాత్ర సందర్భంగా వేలాది మందికి ఆర్థిక సాయం చేశారు. ఎందరికో ఉపాధి కల్పించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో సాయం చేసిన జగన్‌ను విమర్శిస్తున్న మీరు.. మాన్య శ్రీ చంద్రబాబు గారు.. మీరు చేసిన సాయమేంటో టక్కున చెప్పాలని శ్యామల ప్రశ్నించారు. అధికారబలం ఉందని, మీడియా ఉందని మీరు చెప్పే అబద్దాలు నిజాలవుతాయా అని అడిగారు. '