YCP MPs Meet Kumaraswamy:విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అంశం ...కుమారస్వామిని కలిసిన వైసీపీ ఎంపీలు!
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది.
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది.ఎవరెన్ని ఆందోళనలు చేసినా ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) ప్రైవేటీకరణను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నది.
స్టీల్ ప్లాంట్ పరిరక్షణ దిశగా ఆ పార్టీ ఓ అడుగు ముందుకేసింది. ప్రైవేటీకరణ ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్లమెంట్ హౌస్‌లో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్ డీ కుమారస్వామిని(Kumara Swamy) కలిసి వినతిపత్రం అందించింది.స్టీల్ ప్లాంట్‌లో పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విన్నవించుకుంది.విశాఖ స్టీల్ ప్లాంట్ రాష్ట్రానికి ఎంత ప్రతిష్ఠాత్మకమో కుమారస్వామికి వివరించారు ఎంపీలు. విశాఖ ఉక్కు కోసం గతంలో జరిగిన ఉద్యమాల గురించి చెప్పారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్‌పరం చేయకూడదని కోరారు.