MP Vijay sai Reddy : అసలు ఇంగితజ్ఞానం ఏమైనా ఉందా? పురంధేశ్వరికి విజయసాయిరెడ్డి ప్రశ్న!
సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు(Supreme court) తిరుమల లడ్డూ(Tirumala laddu) వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును(Chandrababu) కడిగేసింది కదా!
సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు(Supreme court) తిరుమల లడ్డూ(Tirumala laddu) వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును(Chandrababu) కడిగేసింది కదా! ఇది చాలా మందికి నచ్చలేదు. రాజమండ్రి ఎంపీ, బీజేపీ(BJP) రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురంధేశ్వరికి కూడా! ముఖ్యమంత్రిని పట్టుకుని సుప్రీంకోర్టు అంతలేని మాటలు అంటుందా అని పురంధేశ్వరి(Purandeswari) వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యాఖ్యలపై అప్పుడే కౌంటర్లు మొదలయ్యాయి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి(Vijay sai reddy) ఎక్స్ వేదిక ద్వారా పురంధేశ్వరిపై విమర్శలు కురిపించారు.
'1) పురంధేశ్వరి కనీస ఇంగితజ్ఞానం లేకుండా అత్యున్నత న్యాయస్థానాన్ని, న్యాయమూర్తులను అగౌరవపరుస్తూ, కించపరిచే విధంగా వారి వ్యాఖ్యలను తిరుమల లడ్డుప్రసాదాల విషయంలో తప్పుపడుతూ వారి ప్రతిష్టకు భంగం కలిగించడం రాజ్యాంగ విరుద్ధం, కోర్ట్ ధిక్కారం. ఆమెపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలి.
2) పురంధేశ్వరి మొత్తం మీద సుప్రీంకోర్టుదే తప్పు అని తేల్చేసింది. చంద్రబాబు రాజ్యాంగ పదవిలో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు ఏదైనా అనొచ్చంట. ఏమమ్మా! మరి న్యాయవ్యవస్థ రాజ్యాంగ వ్యవస్థే కదా! తమరికి తెలియదా? అంత చిన్న విషయానికే న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేస్తారా అని చిరాకు పడిపోయారు పురంధేశ్వరి. ఆమెది బావా’తీతమైన ఆవేదన అనుకోవాలి మరి! కోర్టులు, దేవుడి కంటే చంద్రబాబే గొప్పవాడు అన్నట్లుంది ఈమె వైఖరి. ఈ వందేళ్లలో తిరుమల ఆలయానికి నారా, నందమూరి చేసిన డ్యామేజి మరి ఎవరూ చేయలేదు. ఇంకెన్ని ఘోరాలు చూడాలో గోవిందా...గోవిందా.
3)చంద్రబాబు హిందువుల మనోభావాలను లడ్డుప్రసాదాల విషయంలో దెబ్బయటమే కాకుండా మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసారు.' అంటూ ఓ ట్వీట్ చేశారు విజయసాయి రెడ్డి .