MP Kesineni Nani : ఎన్నికల్లో ఓటమి తరువాత చంద్రబాబు సొంత రాష్ట్రానికి వెళ్తారు
తనపై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపై విజయవాడ ఎంపీ కేశినేని నాని(MP Kesineni Nani) ఘాటుగా స్పందించారు. పార్టీని వీడిన వారిని విమర్శించడమే పనిగా పెట్టుకున్న చంద్రబాబు(Chabdrababu), టీడీపీ నేతలను గ్రామ కుక్కలతో పోలుస్తూ నాని విమర్శించారు. ఈ వ్యక్తులు శారీరక హింసకు కూడా పాల్పడతారని ఆయన పేర్కొన్నారు. ఎక్కువగా తిట్టే వారికి పదవులు ఇవ్వడం చంద్రబాబు నైజమని ఆరోపించారు. వారి అభిప్రాయాలను తాను పట్టించుకోనని పేర్కొంటూ విమర్శలను కొట్టిపారేశారు.

నారావారిపల్లెలో నారా లోకేష్(Nara lokesh) తాతకి తప్ప సొంత ఇల్లు లేదని అన్నారు. చంద్రబాబుకు ఇదే ఆఖరి ఎన్నికలు అని.. ఎన్నికల తర్వాత ఆయన తన సొంత రాష్ట్రమైన తెలంగాణకు వెళ్తారని అన్నారు. ఎ.కొండూరు ప్రాంతంలో కిడ్నీ రోగుల పట్ల చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరించారని నాని విమర్శించారు. ఎన్నికలకు ముందు చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి సంబంధించి చంద్రబాబు హడావుడిగా శంకుస్థాపన చేశారని నాని ఆరోపించారు. ఆర్థికంగా వెనుకబడిన వారు కూడా విద్యలో సత్తా చాటేలా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గణనీయమైన చర్యలు తీసుకున్నారని కేశినేని నాని పేర్కొన్నారు.