వైసీపీ ఎమ్మెల్సీ(YCP MLC) దువ్వాడ శ్రీనివాస్‌(Duvvada Srinivas) కుటుంబ వ్యవహారం రోడ్డుకు ఎక్కింది.

వైసీపీ ఎమ్మెల్సీ(YCP MLC) దువ్వాడ శ్రీనివాస్‌(Duvvada Srinivas) కుటుంబ వ్యవహారం రోడ్డుకు ఎక్కింది. మరో మహిళతో సహజీవనం(Live-in) చేస్తున్న తండ్రి ఉంటున్న ఇంటికి వచ్చి కూతుర్లు నాన్నను కలిసేందుకు వచ్చారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి అక్కవరం దగ్గర ఆయన ఇల్లు ఉంది. అక్కడికి ఆయన కూతుర్లు(Daughters) హైందవి(Haindhavi), నవీనలు(Naveena) వచ్చి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటలకు వరకు వేచి ఉన్నారు. ఇంటి గేటు గడియలు కొట్టినా, కారు హారన్‌ మోగించినా లోపలున్నవారు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటిలో విద్యుత్తు దీపాలన్నీ ఆర్పేశారని, లోపల కొన్ని వాహనాలు ఉన్నాయని కుమార్తెలు చెప్పారు. గేటు లోపలి నుంచి తాళాలు వేసినట్లు చెప్పారు. గత కొంత కాలంగా భార్యతో దువ్వాడ శ్రీనివాస్‌కు వివాదం నడుస్తోందని, దీంతోనే ఆయన మరో మహిళతో సహజీవనం చేస్తున్నట్లు సమాచారం. తన మామ చనిపోయినా కూడా కనీసం పరామర్శించేందుకు రాలేదని పెద్ద కూతురు హైందవి ఆవేదన చెందారు. ఎన్నిసార్లు మెసేజెస్ చేసినా, ఫోన్‌ చేసినా స్పందించలేదన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టెక్కలి నుంచి అచ్చెన్నాయుడుపై పోటీచేసి భారీ తేడాతో ఓడిపోయారు. ఎన్నికలకు సంవత్సరం ముందు దువ్వాడ శ్రీను కుటుంబంలో వివాదాలు బయటపడ్డాయి. మూలపేటలో పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు వచ్చిన జగన్‌.. టెక్కలి అసెంబ్లీ సీటును దువ్వాడ శ్రీనుకే ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత కొద్దిరోజుల్లోనే దువ్వాడ శ్రీను సతీమణి దువ్వాడ వాణి జగన్‌ను కలిశారు. దీంతో టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జిగా దువ్వాడ వాణిని నియమించారు. ఆ తర్వాత మళ్లీ టెక్కలి సీటును శ్రీనుకు కేటాయించడంతో తాను స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేస్తున్నట్లు వాణి ప్రకటించారు. దీంతో వైసీపీ నాయకులు వైవీ సుబ్బారెడ్డితో ఆమెకు నచ్చజెప్పి కుటుంబ వివాదాలకు ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నంచేశారు.

Eha Tv

Eha Tv

Next Story