Duvvada srinivas : వాణిది సైకో మనస్తత్వం.. మామ వ్యవసనపరుడు
దివ్వెల మాధురి(Divvela madhuri) కారు యాక్సిడెంట్(Car accident) నాటకం కాదని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్(YCP MLC duvvada srinivas) అన్నారు.
దివ్వెల మాధురి(Divvela madhuri) కారు యాక్సిడెంట్(Car accident) నాటకం కాదని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్(YCP MLC duvvada srinivas) అన్నారు. తనపై ట్రోల్స్ చేస్తూ మాధురిని బలి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెకు పుట్టింటివారు దూరమయ్యారని, అత్తగారు కూడా దూరమయ్యారని చెబుతూ, గతంలో మాధురి ఆత్మహత్యకు(suicide) ప్రయత్నించినప్పుడు తానే కాపాడి ధైర్యం చెప్పానన్నారు శ్రీనివాస్. తన వ్యక్తత్వహననం జరుగుతోందని మాధురి బాధపడిందని చెప్పారు. డిప్రెషన్‌లో ఎటు వెళ్తున్నాదో మాధురికి తెలియదని అన్నారు. డిప్రెషన్ మూడ్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆమె చెప్పిందన్నారు. మాధురి కార్ యాక్సిడెంట్ నాటకం కాదని దువ్వాడ శ్రీనివాస్ స్పష్టం చేశారు. డ్రామా చేయాలని అనుకుంటే అది నిజమైతే ఏం జరిగి ఉండేదని ప్రశ్నించారు. ఈ యాక్సిడెంట్‌లో మాధురి తలకు గాయమైందని, సీటీ స్కాన్ చేయాలని దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు. తలకు గాయమైతే ఏడాదిలో ఏమైనా జరగొచ్చని వైద్యులు చెప్పారంటూ బాధపడ్డారు. తాను ఏ విషయాన్ని అయినా భయపడకుండా నిర్మొహమాటంగా చెబుతాను కాబట్టే శత్రువులు ఎక్కుయ్యారని దువ్వాడ తెలిపారు. ఇప్పుడు తన భార్యవైపే సమాజం నిలబడుతున్నదికానీ ఆమెతో ప్రతిపక్షం నరకం అనుభవించానని తెలిపారు. తన భార్య వాణి తండ్రి రాఘవరావు ఎలాంటి వ్యసనపరుడో అందరికీ తెలుసన్నారు. తమ కాపురంలో ఆయనే ప్రధాన విలన్ అని దువ్వాడ వ్యాఖ్యానించారు. నిజానికైతే తాను మాధురిని చూసేందుకు ఆస్పత్రికి వెళ్లాల్సి ఉందని, కానీ తాను బయటకు వెళ్తే తన ఇంటిని కబ్జా చేస్తారని అన్నారు. పిల్లలను తనపై ఉసిగొల్పిన వాణిది సైకో మనస్తత్వం అని ఆరోపించారు. రెండేళ్ల క్రితమే తన భార్య వాణికి డైవర్స్ నోటీసులు ఇచ్చానని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే దివ్వల మాధురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో యాక్సిడెంట్ చేసినందుకు ఆమెపై కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో పాటు ఇతరుల ప్రాణాలకు హాని కలిగించేలా వ్యవహరించినందుకు చట్ట ప్రకారం ఆమెపై కేసులు పెట్టారు.