Perni Nani Quit Politics : ఇదే నా చివరి సభ.. జగన్కు షాకిచ్చిన పేర్ని నాని
బందరు సభలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని కీలక ప్రకటన చేసారు.. ఇక తాను శాశ్వతంగా రాజకీయాలనుంచి తప్పుకుంటున్నానని, జగన్ తో కలిసి ఇదే నా చివరి మీటింగ్ అంటూ అందరికి షాక్ ఇచ్చారు.. ఇప్పటికే అయన రాజకీయాలకు దూరంగా ఉంటారని వార్తలు వచ్చినప్పటికీ ఎప్పుడూ పెద్దగా స్పందించలేదు. ఈ రోజు ఆయనే స్వయంగా ప్రకటించడంతో అందరూ షాకయ్యారు.. ఇక బందరు నుంచి రాబోయే ఎన్నికల్లో వైసీపీ నుంచి పేర్ని నాని కొడుకు పోటీచేస్తారని తెలుస్తుంది.
మచిలీపట్నం పోర్ట్ నిర్మాణ పనులను సీఎం జగన్ ప్రారంభించారు. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రూ.5,156 కోట్ల వ్యయంతో చేపట్టిన మచిలీపట్నం పోర్టు ద్వారా 25 వేల మందికి ఉపాధి లభించనుంది. మొత్తంగా ఈ పోర్ట్ నిర్మాణ వ్యయం 11,464 కోట్ల రూపాయలు. తొలి దశలో 5,156 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేయనుంది. ఈ కార్యకర్తమంలో ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
బందరు సభలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని (Perni Nani) కీలక ప్రకటన చేసారు.. ఇక తాను శాశ్వతంగా రాజకీయాలనుంచి తప్పుకుంటున్నానని, జగన్ తో (CM Jagan) కలిసి ఇదే నా చివరి మీటింగ్ అంటూ అందరికి షాక్ ఇచ్చారు.. ఇప్పటికే అయన రాజకీయాలకు దూరంగా ఉంటారని వార్తలు వచ్చినప్పటికీ ఎప్పుడూ పెద్దగా స్పందించలేదు. ఈ రోజు ఆయనే స్వయంగా ప్రకటించడంతో అందరూ షాకయ్యారు.. ఇక బందరు (Bandar Constituency) నుంచి రాబోయే ఎన్నికల్లో వైసీపీ నుంచి పేర్ని నాని కొడుకు పోటీచేస్తారని తెలుస్తుంది.