YCP Nallapareddy : చిన్నారి మరణంపై అనుమానాలున్నాయి
నడక మార్గంలో చనిపోయిన చిన్నారి మరణంపై అనుమానాలు ఉన్నాయని వైసీపీ(YCP) ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి(Nallapareddy Prasanna Kumar Reddy) సంచలన కామెంట్స్ చేశారు. తిరుపతి ఘాట్ రోడ్డులో మృతి చెందిన లక్షిత ఘటనపై కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి స్పందించారు.

Lakshitha
నడక మార్గంలో చనిపోయిన చిన్నారి మరణంపై అనుమానాలు ఉన్నాయని వైసీపీ(YCP) ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి(Nallapareddy Prasanna Kumar Reddy) సంచలన కామెంట్స్ చేశారు. తిరుపతి ఘాట్ రోడ్డులో మృతి చెందిన లక్షిత ఘటనపై కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి స్పందించారు. చిన్నారి మృతిపై చాలా అనుమానాలు ఉన్నాయన్నారు. బాలిక మృతి పట్ల తల్లితండ్రులపైనే అనుమానం ఉందన్నారు. బాలిక తల్లితండ్రులను పోలీసులు విచారించాలని కోరారు. చిన్నారి లక్షిత(Lakshitha) తల్లితండ్రుల మీద నాకు అనుమానాలున్నాయని అన్నారు. ఈ విషయమై ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
