క్రాస్‌ ఓటింగ్‌(Cross Voting)కు పాల్పడిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YSRCP) ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి(MLA Mekapati Chandrasekhar Reddy) ఫోన్‌ ఊహించినట్టే స్విచ్ఛాఫ్‌.. ఎమ్మెల్సీ ఫలితాలు(MLC Results) వెల్లడైన వెంటనే చంద్రశేఖర్‌రెడ్డి ఎవరికీ అందుబాటులో లేరు. ఆయన ఎక్కడికి వెళ్లారో కూడా ఎవరికీ తెలియదు.

క్రాస్‌ ఓటింగ్‌(Cross Voting)కు పాల్పడిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YSRCP) ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి(MLA Mekapati Chandrasekhar Reddy) ఫోన్‌ ఊహించినట్టే స్విచ్ఛాఫ్‌.. ఎమ్మెల్సీ ఫలితాలు(MLC Results) వెల్లడైన వెంటనే చంద్రశేఖర్‌రెడ్డి ఎవరికీ అందుబాటులో లేరు. ఆయన ఎక్కడికి వెళ్లారో కూడా ఎవరికీ తెలియదు. చంద్రశేఖర్‌రెడ్డిపై మొదట్నుంచి వైసీపీ అధిష్టాన అనుమానిస్తూనే ఉంది. ఆ అనుమానాలకు కారణం చంద్రశేఖర్‌రెడ్డి ప్రవర్తనే! ఎప్పుడైతే పార్టీ అధినేత జగన్‌(Jagan) క్లాస్‌ తీసుకున్నారో, మరోసారి టికెట్ ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారో అప్పట్నుంచి చంద్రశేఖర్‌రెడ్డి ఆగ్రహంతో ఉన్నారు. పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. అధికారిక కార్యక్రమాలకు అంటిముట్టనట్టుగా ఉంటున్నారు. ఫ్యామిలీలో ఉన్న వివాదాలు కూడా జగన్మోహన్‌రెడ్డి వరకు వెళ్లాయి. 2019 ఎన్నికల్లో చంద్రశేఖర్‌రెడ్డి గెలుపొందిన తర్వాత నియోజకవర్గం గురించి పెద్దగా పట్టించుకోవడం మానేశారు. చంద్రశేఖర్‌రెడ్డి తరఫున శాంతమ్మ అనే మహిళ జనాల్లోకి వచ్చారు. ఆమెను తన భార్య అని చెప్పుకోవడానికి చంద్రశేఖర్‌రెడ్డికి చాలా కాలం పట్టింది. మొత్తం మీద శాంతమ్మ తన రెండో భార్య అని ప్రకటించారు. శాంతమ్మకు మార్కెట్‌ యార్డ్‌ ఛైర్‌పర్సన్‌ పదవి ఇప్పించుకోవాలని చంద్రశేఖర్‌రెడ్డి చాలా ప్రయత్నించారు. జగన్‌ మాత్రం ససేమిరా అన్నారు. శాంతమ్మ వ్యవహారశైలి కూడా మేకపాటిపై నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడానికి కారణమయ్యింది. నియోజకవర్గంలో ఆమె జోక్యం ఎక్కువయ్యిందని కార్యకర్తలు చాలా సార్లు అధిష్టానంతో మొరపెట్టుకున్నారు. ప్రతి విషయంలో ఆమె ఎంటరయ్యేవారు. ఆమెకు తెలియకుండా నియోజకవర్గంలో ఏదీ జరగదన్న ప్రచారం జరిగింది. ఆమె షాడో ఎమ్మెల్యేగా వ్యవహరించడం పార్టీ నేతలకు నచ్చలేదు. మేకపాటి కుటుంబంపై ఉన్న అభిమానంతో జగన్‌ ఎప్పటికప్పుడు చంద్రశేఖర్‌రెడ్డిని అప్రమత్తం చేశారు. అయినా ఆయన జగన్‌ మాటను పట్టించుకోలేదు.

శాంతమ్మ(Shantha Kumari) ఎంటరయ్యాక చంద్రశేఖర్‌రెడ్డి మొదటి భార్య తులసమ్మ(Tulasamma), కూతురు రచనారెడ్డి(Rachna Reddy), ఇతర కుటుంబసభ్యులు ఆయనతో విభేదించి దూరంగా ఉన్నారన్నది ఓ టాక్‌! శాంతమ్మ ఎపిసోడ్‌ కంటిన్యూ అవుతున్నప్పుడే లక్ష్మీదేవి(Lakshmi Devi) అనే మహిళ మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి తన భర్త అంటూ మీడియా ముందుకొచ్చారు. తనకు పదిహేనేళ్ల వయసులో కొండారెడ్డి(Konda Reddy) అనే వ్యక్తితో వివాహం జరిగిందని, పెళ్లయిన రెండేళ్లకే ఆయన తనను వదిలేసి వెళ్లిపోయాడని లక్ష్మీదేవి చెప్పారు. ఆ తర్వాత తనను పెళ్లి చేసుకుంటానని, ఇంటికి తీసుకెళతానని చంద్రశేఖర్‌రెడ్డి తన వెంట పడ్డారని పేర్కొన్నారు. రెండేళ్లపాటు తన చుట్టూ తిరగడంతో ఆయనను గుడ్డి నమ్మానని చెప్పారు. తనను తీసుకెళ్లి బెంగళూరులో కాపురం పెట్టారని, 18 ఏళ్ల పాటు ఆయన తమతోనే ఉన్నారని లక్ష్మీదేవి చెప్పారు. కొడుకు శివచరణ్‌రెడ్డిని బాగా చూసుకునేవారన్నారు. ఎప్పుడైతే శాంతమ్మతో పరిచయం అయ్యిందో అప్పట్నుంచే ఆయన మా ఇంటికి రావడం తగ్గించారని తెలిపారు. ఇదే విషయంపై ఆయనను గట్టిగా నిలదీస్తే రావడం పూర్తిగా మానేశారని లక్ష్మీదేవి తెలిపారు. లక్ష్మీదేవి వీడియో బయటకు రావడంతో చంద్రశేఖర్‌రెడ్డి డిఫెన్స్‌లో పడ్డారు. అయినప్పటికీ తనకు ఇద్దరు భార్యలే తప్ప మూడో భార్య ఎవరూ లేరు అని స్పష్టం చేశారు. తనకు ఇద్దరు అమ్మాయితే తప్ప కొడుకులు లేరన్నారు. కుటుంబ సమస్యలతో సతమతమవుతూ చంద్రశేఖర్‌రెడ్డి నియోజకవర్గాన్ని పట్టించుకోవడం మానేశారు. గడప గడపకు కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఇవన్నీ గమనించే ఉదయగిరి పరిశీలకుడిగా ధనుంజయ్‌రెడ్డిని నియమించింది పార్టీ అధిష్టానం. ధనుంజయ్‌రెడ్డికే వచ్చే ఎన్నికల్లో టికెట్‌ లభిస్తుందన్న విషయం తెలుసుకున్నాక చంద్రశేఖర్‌రెడ్డిలోని అసంతృప్తి రెట్టింపు అయ్యింది. తాను వైఎస్‌ కుటుంబానికి వీర విధేయుడినని చెప్పుకుంటున్నా చంద్రశేఖర్‌రెడ్డి సారథ్యంలో ఎన్నికలకు వెళ్లి ఓటమి మూటగట్టుకోవడానికి జగన్‌ రెడీగా లేరు.

Updated On 24 March 2023 4:48 AM GMT
Ehatv

Ehatv

Next Story