MLA Kethi Reddy : "అతి కూతలు" వద్దు.. యువకునిపై ఎమ్మెల్యే కేతిరెడ్డి ఫైర్
అతి కూతలు" వద్దు అంటూ వైసీపీ(YCP) ఎమ్మెల్యే(MLA) యువకునిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అనంతపురం(Ananthapur) జిల్లా ధర్మవరం(dharmavaram) ఎమ్మెల్యే కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ ఎమ్మెల్యే ప్రోగ్రామ్ లో ఈ ఘటన జరిగింది.
"అతి కూతలు" వద్దు అంటూ వైసీపీ(YCP) ఎమ్మెల్యే(MLA) యువకునిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అనంతపురం(Ananthapur) జిల్లా ధర్మవరం(dharmavaram) ఎమ్మెల్యే కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ ఎమ్మెల్యే ప్రోగ్రామ్ లో ఈ ఘటన జరిగింది. ఆసిఫ్(Asif) అనే యువకుడు మాకు ఇల్లు లేదు అంటూ ఎమ్మెల్యే ను నిలదీశాడు. ఇంటి పట్టా మంజూరు చేయడం లేదని ఎమ్మెల్యే ను అడగడంతో.. 90 రోజుల్లో పట్టా వస్తుందని ఎమ్మెల్యే అన్నారు. మీరు గ్యారంటీ ఇవ్వగలరా అని యువకుడు కేతిరెడ్డిని ప్రశ్నించడంతో.. అతి కూతలు వద్దు అంటూ యువకునిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. నీకు నేను హామీ ఇవ్వాలా అంటూ యువకుడిపై ఫైర్ అయ్యారు. చివరకు 90 రోజుల్లో పట్టా వస్తుందని.. నేను హామీ ఇస్తున్న అనీ ఒప్పుకుని ఎమ్మెల్యే కేతి రెడ్డి అక్కడి నుండి వెళ్లిపోయారు.