Balineni Srinivasa Reddy : జనసేనలోకి బాలినేని..? జగన్కు షాక్ తప్పదా..!
ఒంగోలు రాజకీయాల్లో తనదైన ముద్రవేసి రాజకీయాలను శాసించిన వ్యక్తుల్లో బాలినేని ఒకరు.. రాజశేఖర్ రెడ్డి(Rajeshekar Reddy) అనుచరుడిగా వచ్చి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి అటు ఎమ్మెల్యే, మంత్రిగా చేసిన అనుభవం ఆయనది.. ఇక జగన్ స్థాపించిన వైసీపీలో చేరి పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేసి జగన్ ను అధికారంలో కూర్చోబెట్టడానికి కారణమైన ముఖ్యవ్యక్తుల్లో బాలినేని ఒకరు..
ఒంగోలు రాజకీయాల్లో తనదైన ముద్రవేసి రాజకీయాలను శాసించిన వ్యక్తుల్లో బాలినేని ఒకరు.. రాజశేఖర్ రెడ్డి(Rajeshekar Reddy) అనుచరుడిగా వచ్చి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి అటు ఎమ్మెల్యే, మంత్రిగా చేసిన అనుభవం ఆయనది.. ఇక జగన్(Jagan) స్థాపించిన వైసీపీలో(YCP) చేరి పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేసి జగన్ ను అధికారంలో కూర్చోబెట్టడానికి కారణమైన ముఖ్యవ్యక్తుల్లో బాలినేని ఒకరు.. అయితే ఇప్పుడు బాలినేనికి బ్యాడ్ టైమ్ నడుస్తుంది.. ఎటుచూసినా అవమానాలు, అసహనాలే కనిపిస్తున్నాయి. జగన్ కాబినెట్ మార్పు దగ్గరనుంచి బాలినేని పార్టీపై చాలా అసంతృప్తిగా ఉన్నారు.
ఒంగోలు జిల్లాలో బాలినేనికి ఎంతో పలుకుబడి ఉంది.. దాదాపు జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో ఆయనకు అభిమాన వర్గం ఉన్నారు. జగన్ సైతం అయన మాటను కాదని ఎవరికీ టికెట్ కూడా ఇచ్చేవారు కాదు.. కానీ ఇప్పుడు పరిస్థితులు ఆలా లేవు.. జగన్ బాబాయి, టీటీడీ(TTD) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిది జిల్లాలో పెత్తనం సాగిస్తున్నారు. సుబ్బారెడ్డి బాలినేనికి మధ్య ఎప్పటినుంచో విభేదాలు కొనసాగుతున్నాయి. కానీ అవి ఎప్పుడూ పార్టీపై ఎఫెక్ట్ చూపలేదు. తాజాగా తనపై పార్టీలోనే కొందరు అబద్దాలు చెబుతున్నారని, అవినీతి చేస్తునాన్ని తప్పుడు వార్తలు చెబుతున్నారని అయన మీడియా ముందు వాపోయారు.. జగన్ దగ్గరకు తన సమస్యను తీసుకెళ్లిన పెద్దగా పట్టించుకోలేదని కొంత సన్నిహితుల వాదన.
బాలినేని అసంతృప్తిగా ఉన్నారు. ఇది ఇలాగే కొనసాగితే రాబోయే ఎన్నికల్లో అయన పోటీ చేయరు అనే వాదన కూడా వినిపిస్తుంది. అయితే బాలినేని వేరే పార్టీలో చేరాలనుకుంటున్నారని, అందుకే వైసీపీపై అసహనం వ్యక్తంచేస్తున్నారని పార్టీ నేతల విమర్శిస్తున్నారు. బాలినేని అంటే గిట్టని కొంతంనుండి నేతలు అయన టీడీపీలో కానీ, జనసేనలోకాని చేరబోతున్నారని వార్తలను వైరల్ చేస్తున్నారు.. పవన్ కు బాలినేనికి మంచి సంబంధాలు ఉన్నాయి.. వైసీపీ ఎమ్మెల్యేలను పవన్ తిట్టినా.. బాలినేనిపై మాత్రం ఎప్పుడూ విమర్శలు చేయలేదు. అంతే కాకుండా ఒంగోలు జనసైనికులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేస్తే, బాలినేని వారిని విడిపించారు. వీటన్నిటి నేపథ్యంలో బాలినేని జనసేనలోకి వెళ్తారని ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. కానీ వీటన్నిటిని బాలినేని కండించారు, అవసరమైతే రాజకీయాలను వొదిలేస్తానే కానీ పార్టీలు మారనంటూ అయన వ్యాఖ్యలు చేసారు.. చూడాలి మరి రాబోయే ఎన్నికల్లో బాలినేని దారి ఎటు అనేది.