Ambati Rambabu : పవన్ ఓ పెళ్ళిళ్ల విప్లవకారుడు.. మంత్రి అంబటి సంచలన వ్యాఖ్యలు
పవన్ కళ్యాణ్(Pawan Kalyan).. ఒక మ్యాడ్ డాగ్(Mad Dog) అంటూ మంత్రి అంబటి రాంబాబు(Minister Ambati Rambabu) సంచలన వ్యాఖ్యలు చేశారు. భీమవరం(Bhimavaram)లో నిన్న పవన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రస్థాయిలో స్పందిచారు. పవన్ ఓ పెళ్ళిళ్ల విప్లవకారుడు అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు(Chandrbabu)కు పదవి.. పవన్ కు ప్యాకేజీ.. ఇదే వారిద్దరి డీల్ అని విమర్శలు గుప్పించారు.

Ambati Rambabu
పవన్ కళ్యాణ్(Pawan Kalyan).. ఒక మ్యాడ్ డాగ్(Mad Dog) అంటూ మంత్రి అంబటి రాంబాబు(Minister Ambati Rambabu) సంచలన వ్యాఖ్యలు చేశారు. భీమవరం(Bhimavaram)లో నిన్న పవన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రస్థాయిలో స్పందిచారు. పవన్ ఓ పెళ్ళిళ్ల విప్లవకారుడు అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు(Chandrbabu)కు పదవి.. పవన్ కు ప్యాకేజీ.. ఇదే వారిద్దరి డీల్ అని విమర్శలు గుప్పించారు. నా కొడకల్లారా.. అంటూ తిట్టడమే పవన్ పొలిటికల్ పాలసీనా? అంటూ ప్రశ్నించారు. వారాహి(Varahi) ఎక్కి బూతులా..?.. అందుకే వరాహి అంటున్నామని జగన్(YS Jagan)ను ఎత్తిచూపిన పవన్‌కు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. చంద్రబాబు కోసమే పవన్ పార్టీ నడుపుతున్నారని.. గోదావరి జిల్లాల(Godavari Districts)ను బాబుకు అమ్మేశావా..? అని ప్రశ్నించారు. నీ బాగోతం అంతా నాకు తెలుసు అన్న పవన్ వ్యాఖ్యలకు కౌంటర్‌గా.. జగన్ గురించి తెలిస్తే.. పుస్తకం రాయొచ్చు కదా? అని సలహా ఇచ్చారు.
నలుగురు వీరుల పేర్లు చెబితే.. నీవు పోరాటం చేసినట్టా..? పవన్‌ను ప్రశ్నించారు. నీవు చేసిన పోరాటం ఏమిటి.. ఎక్కడ..? అని మీడియా ద్వారా నిలదీశారు. కాపులను బాబు దగ్గర తాకట్టు పెట్టాలన్నదే పవన్‌కళ్యాణ్ లక్ష్యం అని విమర్శించారు. పవన్ అసలు రాజకీయ నాయకుడే కాదని.. రాజకీయాల్లో ఆయనో చీడపురుగు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ ను అస్సలు నమ్మొద్దని జనాలకు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికలు పేదలు, పెత్తందార్ల మధ్య జరిగే పోటీ. పవన్ పెత్తందార్ల పక్షాన నిలబడ్డారు. అందుకే పవన్‌కు మళ్లీ ఓటమి తప్పదని అన్నారు.
