Ambati Rambabu : జగన్‌ను ఓడించడం ఎవరి వల్లా కాదు
ముఖ్యమంత్రి జగన్‌ను(Jagan) ఓడించడం ఎవరి వల్లా కాదని మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. మరోమారు జనసేన(Janasena) అధినేత పవన్ కళ్యాణ్‌పై(Pawan kalyan) సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ కు రాజకీయాలు తెలియవని కామెంట్ చేశారు. పవన్ అభిమానులకు, మా కులపు వాళ్లకు ఒకటే చెబుతున్నా

Ambati Rambabu
ముఖ్యమంత్రి జగన్‌ను(Jagan) ఓడించడం ఎవరి వల్లా కాదని మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. మరోమారు జనసేన(Janasena) అధినేత పవన్ కళ్యాణ్‌పై(Pawan kalyan) సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ కు రాజకీయాలు తెలియవని కామెంట్ చేశారు. పవన్ అభిమానులకు, మా కులపు వాళ్లకు ఒకటే చెబుతున్నా.. పవన్ కు రాజకీయాలు తెలియవని.. ఆయన చంద్రబాబుకు అమ్ముడుపోయాడని వ్యాఖ్యానించారు. మా లీడర్ ముఖ్యమంత్రి కావాలి.. మా కులపోడు సీఎం కావాలని మీరు ఆశపడుతున్నారు.. అది మంచిదే.. కానీ కాలేడు అని కామెంట్ చేశారు. తాను ముఖ్యమంత్రి అభ్యర్థిని కాదని స్వయంగా పవన్ కల్యాణ్ చెప్పినా వినిపించుకోకపోతే ఎలాగని ప్రశ్నించారు.
పవన్ కల్యాణ్ చంద్రబాబుకు(Chandrababu) అమ్ముడుపోయి టీడీపీ(TDP) కోసం రాజకీయం చేస్తున్నాడని అన్నారు. టీడీపీ, జనసేన కలిసి వచ్చినా.. మరో ఇద్దరితో కలిసి వచ్చినా వైసీపీపై ఎలాంటి ప్రభావం ఉండదన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో మరోమారు వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి.. ఏ రాజకీయ నేత కూడా చేయని సవాల్ ను జగన్ ప్రతిపక్షాలకు విసురుతున్నారని.. ‘ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో మీ ఇంట్లో వారికి లబ్ది కలిగితేనే మాకు ఓటేయండి, లేదంటే వేయొద్దు’ అంటూ ఓటర్లకు సూచించిన ఒకే ఒక లీడర్ జగన్ అని అన్నారు.
