Minister Ambati Rambabu : మంత్రి అంబటికి తృటిలో తప్పిన ప్రమాదం
వైసీపీ(YCP) సీనియర్ నేత, మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఖమ్మం(Khammam) జిల్లాలో ఆయన కాన్వాయ్(Convoy) ప్రమాదానికి గురైంది.

Minister Ambati Rambabu
వైసీపీ(YCP) సీనియర్ నేత, మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఖమ్మం(Khammam) జిల్లాలో ఆయన కాన్వాయ్(Convoy) ప్రమాదానికి గురైంది. మంత్రి అంబటి రాంబాబు అశ్వారావుపేట వైపు నుంచి ఖమ్మం వైపు వెళ్తుండగా.. అదే రూట్ లో నాందేడ్ నుంచి విశాఖపట్నానికి గోధుమ బస్తాల లోడుతో ఓ లారీ(Lorry) వెళ్తోంది. ఈ క్రమంలో సత్తుపల్లి(Sathupalli) శివారులోకి వెళ్ళగానే.. ముందు వాహనంలోని కర్రలు.. గోధుమల లోడుతో వెళ్తున్న లారీకి బలంగా తగిలాయి. దీంతో గోధుమల బస్తాలు మంత్రి అంబటి రాంబాబు కారు బానెట్‌పై పడ్డాయి. డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. రెప్పపాటులో ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
