YCP Madhuri : అడల్ట్రీకి సహజీవనానికి తేడా ఏందబ్బా, దువ్వాడ ఉంచుకున్నామే కొత్త పలుకులు
దువ్వాడ(Duvvada srinivas) కథా చిత్రం రోజురోజుకు రక్తి కడుతోంది.
దువ్వాడ(Duvvada srinivas) కథా చిత్రం రోజురోజుకు రక్తి కడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈయనగారి వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. గురువారం అర్ధరాత్రి వరకు శ్రీనివాస్ ఇంటి దగ్గర కూతుర్లు నిరసన చేసిన విషయం తెల్సిందే. శుక్రవారం మరోసారి ఆయన భార్య, కూతురు మీడియాతో మాట్లాడారు. తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని దీంతో సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం నుంచి వచ్చానని, భర్త చేస్తున్న పనితో మానసికంగా కృంగిపోతున్నానని ఆమె వాపోయారు. తన కూతుర్ల భవిష్యత్ గురించి ఆందోళన చెందుతున్నానని కంట తడి పెట్టుకున్నారు. పార్టీ అధిష్టానం తన భర్తపై చర్యలు తీసుకోవాలని కోరారు.
మరోవైపు దువ్వాడ శ్రీనివాస్ తన భార్యపై సంచలన ఆరోపణలు చేశారు. తనను చంపడానికి తన భార్య వాణి(Vani) ప్రయత్నిస్తోందన్నారు. తనను చంపడానికి కత్తులు, రాడ్ల తీసుకుని వచ్చారని ఆరోపించారు. నన్ను చంపి నా ఇంటిని లాక్కోడానికి కుట్ర చేస్తున్నారన్నారు. అధికార పక్షం అండతో తనపై కుట్ర చేస్తున్నారని.. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని దువ్వాడ శ్రీనివాస్ పేర్కొన్నారు.
అయితే దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి ఉంటున్న మహిళ(Madhuri) మీడియా ముందుకు వచ్చి మరో కీలక విషయం వెల్లడించారు. దువ్వాడ శ్రీనివాస్‌ను నేను పెళ్లి చేసుకోలేదని, నేను ఆత్మహత్య(suicide) చేసుకోవాలనుకున్నప్పుడు దువ్వాడ శ్రీనివాస్ నాకు అండగా ఉన్నారన్నారు. నాకు విడాకులు(divorce) కాలేదు, దువ్వాడ శ్రీనివాస్‌కు విడాకులు కాలేదు మేం పెళ్లి చేసుకోలేదన్నారు. అతను నాకొక్క గైడ్, ఫిలాఫసర్ అని అన్ని విధాల నాకు తోడుగా ఉన్నాడని మీడియాకు వివరణ ఇచ్చింది. శ్రీనివాస్‌తో సహజీవనం(Live in) చేస్తున్నారా అన్న ప్రశ్నకు సహజీవనం అని ఎలా అంటారు, మాది అడల్ట్రీ అనుకోవచ్చుగా అని కొట్టిపారేస్తున్నారు. అడల్ట్రీ(adultry) అంటే ఒక మగ, ఆడ ఎలాంటి ఫిజికల్ రిలేషన్ లేకుండా ఒక ఇంట్లో కలిసి ఉండడం అన్న భావనతో ఆమె చెప్పుకొచ్చారు. ఇతర దేశాలకు వెళ్లిన మన వాళ్లు ఆడ, మగ కలిసి ఉంటలేరా ఇది కూడా అంతే అన్న రేంజ్‌లో బిల్డప్ ఇచ్చారు.