Janasena : జనసేన ఓట్లపై వైసీపీ సెటైర్లు..!
తెలంగాణలో(Telangana) జనసేనకు(Janasena) వచ్చిన ఓట్లపై వైసీపీ(YCP) కార్యకర్తలు తెగ సంతోషపడుతున్నారట. తెలంగాణలో జనసేన ప్రభావం వల్ల నోటా(NOTA) ఓట్లు దెబ్బతిన్నాయని ట్రోల్స్ చేస్తున్నారు వైసీపీ మద్దతుదారులు. జనసేనకు వచ్చిన ఫలితాలపై వైసీపీ కార్యకర్తలు సెటైర్లు వేస్తున్నారు తెలంగాణలోనూ నేను ప్రభావం చూపిస్తా అని గొప్పలు చెప్పుకున్న పవన్.. 'తనకు వేరే ఎవరితో పోటీ లేదు..
తెలంగాణలో(Telangana) జనసేనకు(Janasena) వచ్చిన ఓట్లపై వైసీపీ(YCP) కార్యకర్తలు తెగ సంతోషపడుతున్నారట. తెలంగాణలో జనసేన ప్రభావం వల్ల నోటా(NOTA) ఓట్లు దెబ్బతిన్నాయని ట్రోల్స్ చేస్తున్నారు వైసీపీ మద్దతుదారులు. జనసేనకు వచ్చిన ఫలితాలపై వైసీపీ కార్యకర్తలు సెటైర్లు వేస్తున్నారు తెలంగాణలోనూ నేను ప్రభావం చూపిస్తా అని గొప్పలు చెప్పుకున్న పవన్.. 'తనకు వేరే ఎవరితో పోటీ లేదు.. నోటాతోనే తన పోటీ' అంటూ వ్యంగ్యంగా సోషల్ మీడియాలో(Social media) విపరీతంగా పోస్టులు షేర్ చేస్తున్నారు.
అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో(BJP) కలిసి పోటీ చేసిన జనసేనకు గట్టి ఎదురుదెబ్బ తగిలిందంటున్నారు విశ్లేషకులు. పోటీ చేసిన 8 స్థానాల్లో ఎక్కడా పవన్ పార్టీ(Pawan Kalyan) ప్రభావం చూపలేదు. ఒక్క కూకట్‌పల్లి(Kukatpally) మినహా ఏ స్థానంలోనూ డిపాజిట్లు కూడా దక్కించుకోలేదు. గత ఎన్నికల్లో ఏపీలో మాదిరిగానే తెలంగాణలో జనసేనకు షాక్ తగిలింది. బీజేపీతో పొత్తు పెట్టుకున్నజనసేన.. 9 స్థానాల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. 7 చోట్ల డిపాజిట్లు కూడా దక్కకపోవడంతో జనసైనికులు తీవ్ర నిరాశలో ఉన్నారు. అసలు తొలుత పవన్ ప్రచారమైనా చేస్తాడా లేదా అన్న వార్తలు వచ్చాయి. చివరి దశలో పవన్ కల్యాణ్ ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు పోటీ చేసిన పలు చోట్ల పవన్ ప్రచారం చేసినా ఫలితాలు షాక్ ఇచ్చాయి.
పొత్తులో భాగంగా కోదాడలో(Kodhada) మేకల సతీష్‌రెడ్డి, తాండూర్‌లో నేమూరి శంకర్ గౌడ్, ఖమ్మంలో మిర్యాల రామకృష్ణ, కొత్తగూడెంలో లక్కినేని సురేందర్ రావు, అశ్వారావుపేట(ఎస్టీ)లో ముయబోయిన ఉమాదేవి, వైరా(ఎస్టీ)లో సంపత్ నాయక్, నాగర్‌కర్నూల్‌లో వంగల లక్ష్మణ్ గౌడ్, కూకట్‍పల్లిలో ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ పోటీ చేశారు. జనసేన టికెట్ దక్కించుకుని పోటీ చేసినా ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు.
ఆంధ్రప్రాంతం నుంచి వచ్చి ఎక్కువగా స్థిరపడ్డ కూకట్‍పల్లిలో అయినా జనసేన ప్రభావం చూపిస్తుందని భావించినా అది జరగలేదు. కూకట్‌పల్లిలో మూడో స్థానంలో నిలిచింది. కూకట్‌పల్లి మినహా 7 చోట్ల కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేదు. సెటిలర్స్ ఎక్కువగా ఉండడంతో ఈ స్థానంపై పవన్ కల్యాణ్ కూడా ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇక్కడ జనసేనకు 39,830 ఓట్లు మాత్రమే రాబట్టుకోగలిగింది. 70 వేల ఓట్లకుపైగా మెజార్టీతో ఇక్కడ బీఆర్‌ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు గెలిచారు.
కోదాడలో జనసేన గ్లాస్ గుర్తుపై కేవలం 2,151 ఓట్లు పడగా.. ఖమ్మలో 4,040 ఓట్లు పడ్డాయి.కొత్తగూడెంలో 1,945 ఓట్లు, నాగర్‌కర్నూల్‌లో 1,955 ఓట్లు.. వైరాలో 2,712 ఓట్లు, అశ్వరావుపేటలో 2,281 ఓట్లు మాత్రమే పవన్ పార్టీకి వచ్చాయి. తెలంగాణలోనే జనసేన పార్టీ పుట్టినా ఏపీ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు ఇప్పటికే పవన్ ప్రకటించారు. అంతేకాదు ఏపీలోనూ బీజేపీతో పొత్తు పెట్టుకొని టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయాలని పవన్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల్లో తగిలిన షాక్‌తో ఏపీలో ఎలాంటి వ్యూహాలు పన్నుతారన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది.